- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గట్టిగా బుద్ది చెబుతాం
- ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా?
- గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుకు పరామర్శ
- దాడి గురించి ఆరా తీసిన పవన్ కళ్యాణ్
అహంకారంతో వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఘాటుగగా హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైకాపా రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్. ఇష్టారాజ్యంగా చేయలేరు. విూ అహంకారం ఎలా అణచివేయాలో మాకు తెలుసు. చేసి చూపిస్తాం. అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తాం‘ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. అనంతరం పవన్ విూడియాతో మాట్లాడారు. ‘గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును అమానుషంగా కొట్టారు. అధికారులపై దాడి చేయడం వైకాపాకు కొత్త కాదు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం. పులివెందుల నియోజకవర్గంలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యపై పవన్ స్పందించారు. ఆ ఘటన బాధాకరమని.. దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం రైతు తన భూమి మ్యుటేషన్ పెట్టుకున్నారని.. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ విూడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచారు. బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇదిలాఉండగా, పవన్‌ని చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్‌గా విూడియాతో మాట్లాడుతున్న సమయంలో ’ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఏంటయ్యా విూరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో విూకు తెలియదు. పక్కకు రండి‘ అంటూ తన అసహనాన్ని తెలియజేశారు. పవన్‌కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస విూటింగ్స్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు, దర్శక – నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తిచేస్తున్నారు. తన తదుపరి చిత్రాలు ’ఓజీ’, ’హరిహర వీరమల్లు’ షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రమే ’ఓజీ’. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.