బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో ఆగస్టు 23న
బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ఉచిత రైనోప్లాస్టీ (ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ) మరియు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం ఆగస్టు 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఔట్‌పేషెంట్ సెంటర్, రోడ్ నంబర్ 10లో జరగనుంది. ఈ శిబిరాన్ని కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, ఇఎన్‌టి విభాగం హెడ్ & చీఫ్ కన్సల్టెంట్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి పర్యవేక్షించనున్నారు.
ఈ శిబిరంలో భాగంగా, పెద్దగా లేదా వెడల్పుగా ఉన్న ముక్కు, చిన్నగా లేదా వంకరగా ఉన్న ముక్కు, చదునైన ముక్కు, బయటకు పొడుచుకు కనిపించే చెవులు, ముఖంపై మచ్చలు, కనురెప్పల మడతలు, ముఖ బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారికి నిపుణులు ఉచితంగా పరీక్షలు, సంప్రదింపులు అందిస్తారు. అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సమస్యలకు పరిష్కారం కోరుకునే వారికి నిపుణుల వైద్య సలహా అందించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ఉచిత శిబిరం గూర్చి, డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ, “ఈఎన్టి మరియు ఫేషియల్ ప్లాస్టిక్ సమస్యలకు ముందుగానే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. సకాలంలో రోగాన్ని గుర్తించి సరైన చికిత్స చేయిస్తే, అది రోగి జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. కేవలం ఆరోగ్య సమస్యల పరిష్కారమే కాకుండా, రూపం మరియు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గుతాయి” అని చెప్పారు.
ఉచిత రిజిస్ట్రేషన్ మరియు మరింత సమాచారం కొరకు 9908354270 లో సంప్రదించండి.