Sunday, July 20, 2025
spot_img

12 వేలు తగ్గనున్న పసిడి ధర

Must Read

పలు కారణాలు చెబుతున్న విశ్లేషకులు

ప్రస్తుతం రూ.97 వేలు పలుకుతున్న 10 గ్రాముల బంగారం ధర.. రానున్న రోజుల్లో రూ.12 వేలు తగ్గనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రూ.80 వేల నుంచి రూ.85 వేల మధ్యలో ఉండనుంది. పాకిస్తాన్‌పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టాక గోల్డ్ రేట్లు తగ్గాయి. 10 గ్రాములకు రూ.2 వేలు దిగొచ్చింది. సమీప భవిష్యత్తులో మరింత చౌకగా మారొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పుత్తడి ధరలు పెరిగినప్పుడు విపణిలో లాభాలు వస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు పెరిగాయి. దీనివల్ల లాభాలను ఆకర్జించడానికి గోల్డ్‌ను అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఇది ధరలపై ప్రభావం చూపుతుంది.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే భౌగోళిక, రాజకీయ సంఘటనలు బంగారం ధరపై ఎఫెక్ట్ చూపుతాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారానికి గిరాకీ పెరుగుతుంది. కానీ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా.. సుంకాలపై తన ఆలోచనను సాఫ్ట‌గా చేసుకుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల బంగారం ధరలో తగ్గుదల ఉండొచ్చు. గోల్డ్ రేట్‌ను డిసైడ్ చేయటంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఈ నెల 6న ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ అవుతోంది. ఈ మీటింగ్‌లో రెపో రేటును తగ్గించే ఛాన్స్ ఉంది. దీంతో పసిడి ధర తగ్గుతుంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్‌పై ప్రెజర్ పెడుతున్నారు. కాబట్టి ఫెడ్ రేట్లను తగ్గిస్తే గోల్డ్‌కి సపోర్ట్ లభిస్తుంది.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS