Monday, February 24, 2025
spot_img

గోల్డెన్ కి మిరాకి పేరుతో గోల్మాల్..

Must Read
  • కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి
  • అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో మునుత్ ట్రస్ట్ డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్..
  • పోలీస్ స్టేషన్ ని మేనేజ్ చేసుకుని దొడ్డి దారిన సర్టిఫికెట్ పొందిన వైనం..
  • సదరు సర్టిఫికేట్ తో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు..
  • నిషేధిత జాబితాలో ఉన్న సర్వేనెంబర్ కు వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాకొర్లు..
  • ఫ్లాట్ నెంబర్ ఏ/10 అంటూ 12 వేల పైచిలుకు గజాల రిజిస్ట్రేషన్ చేసుకున్న దుర్మార్గం..
  • చక్రపూరి కాలనీ లేఅవుట్ లో ఉన్న ప్లాట్ నెంబర్ ను బూచిగా చూపించారు..
  • మునూత్ ట్రస్ట్ ను దర్జాగా పావుగా వాడుకున్న దగాకోర్లు..
  • హెచ్ఎండిఏ యాదగిరిరావుతో లోపాయికారి ఒప్పందం..
  • లేఅవుట్ లో లేఅవుట్ సృష్టించి మిరాకిల్ చేసిన కేటుగాళ్ళు..
  • ఎకరాలకు ఎకరాలు అక్రమంగా చేసుకున్న డాక్యుమెంట్లను క్యాన్సల్ చేయిస్తానంటూ సుదీర్ కీర్తి అనడంలో మతలబెంటి..?
  • హెడ్రా కమిషనర్ రంగనాథ్ కి అన్నీ అక్రమమని తెలిసినా కూల్చివేయడంలో వెనకడుగు ఎందుకు వేస్తున్నారు..?
  • పఠాన్ చెరులో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గూడెం బ్రదర్స్ అక్రమాలకు చెక్ పెట్టేది ఎప్పుడు..?
  • గోల్డెన్ కీ పేరుతో కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్నీ తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు..

గోల్డెన్ మిరాకీ.. కీ అంటే తాళం చెవి.. పేదల గూడుకోసం తలుపులు తెరిచే కీ అనుకున్నారు అందరు.. కానీ వారి జీవితాలను మూసేసే తలుపులకు వేసే తాళం చెవికి సంబంధించిన కీ అని గ్రహించలేకపోయారు.. అమాయకంగా దుర్మార్గుల చేతిలో చిక్కి విల విలలాడిపోతున్నారు.. గోల్డెన్ మిరాకీ పేరుతో దర్జాగా కబ్జాలు చేస్తూ.. నకిలీ డాక్యుమెంట్లతో రెచ్చిపోతూ.. కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నా ఇప్పటి ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోతోంది.. హైడ్రా పేరుతో హంగామా సృష్టించి పేదల గుడిసెలను కూల్చేసిన అధికారులు గోల్డెన్ కీ జోలికి వెళ్ళడానికి వెనుకంజవేస్తున్నారు..? దీని మర్మమేమి రామచంద్రా అంటూ నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు అమాయక పేద ప్రజలు.. అసలు ఏమి జరుగుతోంది..? వీరు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడుతున్నారా..? లేక డబ్బులకు అమ్ముడుబోయి ఆత్మ వంచన చేసుకుంటున్నారా..? ఏది ఏమైనా నష్టపోయేది అమాయకులైన పేదలే కదా..? ఓట్లేసి, ఎన్నుకున్న పాలకులు తమకు రక్షణగా ఉంటారనుకుంటే.. కనికరంలేకుండా భక్షిస్తున్నారు.. ఇంకెవరికి చెప్పుకోవాలి..? ఏది ఏమైనా ప్రభుత్వం కళ్లుతెరవాలి.. లేదంటే మరో పోరాటం వైపు అమాయకులు మొగ్గుచూపితే.. చాలా విధ్వంసం జరుగుతుంది..

సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో.. 1985లో ఉన్న నాటి హుడా.. నేడు హెచ్ఎండిఏగా ఉన్న కార్యాలయం నుండి.. ఎల్.పీ. నెంబర్ 3814/85గా అనుమతి పొందిన లేఔట్ కలదు.. ఇట్టి లేఔట్ లో ఉన్న సర్వే నెంబర్లు 126, 127, 128, 129, 130, 135, 136, 137, 152 మరియు 153 లుగా రికార్డులు తెలుపుతున్నాయి.. ఇట్టి లేఔట్ కు సంబంధించి 45.497 ఎకరాలలో ప్లాట్ లకు సంబంధించిన ఏరియా, 21.640 ఎకరాలలో రోడ్లు, 7.913 ఎకరాలలో ఓపెన్ స్పేస్, 4.080 ఎకరాలలో ఎమినిటిస్ తో కలిపి మొత్తం ఈ యొక్క లేఔట్ లో 765 ప్లాట్లు చేసి, 8.87 ఎకరాల్లో అండర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్డు, ఎఫెక్ట్ డ్ ఏరియా అని మొత్తం 88 ఎకరాల్లో ఈ లేఔట్ ఏర్పాటు చేయడం జరిగింది అనేది లే అవుట్ తెలుపుతుంది.. ఈ యొక్క లేఔట్ లో ఉన్న సర్వే నెంబర్ 152, 153 లు రిజిస్ట్రేషన్ చట్టం 1908లో 22ఏ లో నిషేధిత జాబితాలో.. ఇతరులకు భూ బదలాయింపు చేయడానికి వీలులేని భూములుగా.. పొందుపరచి ఉంది.. ధరణి రికార్డు పరిశీలన చేసి సర్వేనెంబర్ 152, 153 నేటికీ ప్రభుత్వ భూములుగా చూపిస్తుంది.. కాగా అమాయక ప్రజల సొమ్మును కాజేయుటకు బోగస్ పత్రాలు సృష్టించి, కబ్జాలు చేసి కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్న గూడెం బ్రదర్స్ పై ఇటీవలే ఈడీ కేసు నమోదు అయిన విషయం అందరికీ తెలిసిందే.. సంతోష్ గ్రానైట్ కంపెనీ యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి.. ఇతగాడి తోపాటు భూకబ్జాలకు పాల్పడుతున్న సుదీర్ కీర్తి.. ఈ ఇద్దరూ అమీన్ పూర్ లోని చక్రపూరీ కాలనీ లేఔట్ పై కన్నేశారు.. నకిలీ పత్రాలు సృష్టించడం కబ్జాలు చేయడమే ధ్యేయంగా.. పక్కా ప్రణాళికతో మునత్ ట్రస్టును తెరపైకి తెచ్చి 1982, 85 లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని, గత ప్రభుత్వంలో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసి, అక్కడి స్టాఫ్ ని మేనేజ్ చేసుకొని ఒక సర్టిఫికెట్ పొందారు ఈ అక్రమార్కులు.. కాగా దీనిని బూచిగా చూపుతూ.. సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తో లోపాయి కారి ఒప్పందం చేసుకొని, 22 ఏ నిషేదిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153 గల భూములకు ఫ్లాట్ నెంబర్ ఏ/10 అని చూపి, దీని యొక్క విస్తీర్ణం 12114.408 గజాలుగా బోగస్ పత్రాలను సృష్టించి.. రాత్రి వేళలో రిజిస్ట్రేషన్ చేసుకొని భూ కబ్జాలకు తెర లేపారు ఈ దుర్మార్గులు..

ఈ యొక్క డాక్యుమెంట్లతో హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరిరావుకు ముడుపులు ముట్టచెప్పి, చక్రపురికాలనీ లేఅవుట్ లో వెంకటరమణ కాలనీ లేఔట్ అంటూ మరో మ్యాప్ సృష్టించి, దర్జాగా దందా చేస్తున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మా ప్లాట్లు కబ్జాలు చేస్తున్నారు.. మా స్థలాలు కబ్జాలు చేస్తున్నారు.. అని స్థానికులు నెత్తీ నోరు కొట్టుకుని మొరపెట్టుకున్నా.. విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు తప్ప నకిలీ పత్రాలు సృష్టించి, గోల్డెన్ కీ నిర్మాణం చేస్తున్న చోటు కబ్జా అని తెలిసినా వాటిని కూల్చడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

హైడ్రా పేరుతో పేద ప్రజలకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు.. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, సుధీర్ కీర్తి లు కలిసి చేస్తున్న ఈ కబ్జాపై ఎందుకు చర్యలు తెలుసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు..? ప్లాట్ నెంబర్ అంటే లేఔట్ లో ఉంటుంది.. అలాంటి దాన్ని ఫ్లాట్ నెంబర్ తో పోలుస్తారు.. మరి ఇక్కడ లేఔట్ లో ఫ్లాట్ నెంబర్ అనే కదా రిజిస్ట్రేషన్ చేసుకుంది..? ఈ ఫ్లాట్ నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో లేఅవుట్ ఎలా తయారు చేశారు..? హైడ్రా అధికారులకి ఇది కనబడలేదా..? లేదా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఇప్పటికీ పలుమార్లు విచారణ చేసినా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం లేదని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి.. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు, కబ్జాలకు అడ్డుకట్ట వేసి ఇతగాడితో అంటకాగుతున్న సుధీర్ కీర్తిని విచారణ జరిపి.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు..

హైడ్రా కార్యాలయ పరిధిలో గూడెం మధుసూదన్ రెడ్డి, సుధీర్ కీర్తి కలిసి గోల్డెన్ కీ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంతో నష్టపోయిన బాధితులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. అక్కడికి వచ్చిన గూడెం మధుసూదన్ రెడ్డి, సుధీర్ కీర్తి ఫిర్యాదారులను బెదిరించడం ఏంటని..? ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న సుధీర్ కీర్తి బాధితులతో మాట్లాడుతూ.. ఎకరాలకు ఎకరాల భూములకు సంబంధించి వారు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లను క్యాన్సల్ చేసుకుంటామని నేరుగా చెప్పడం చూస్తుంటే వారు కబ్జాలు చేస్తున్నది వాస్తవమేనని తేటతెల్లమైపోతుంది.. అవినీతి నిరోధక శాఖ అధికారులు హెచ్ఎండిఏ యాదగిరి రావు చేసిన అరాచకాలకు, ఇలా బోగస్ పత్రాలు సృష్టించడానికి పరోక్ష సహకారం అందించిన అధికారులకు, రాత్రి వేళలో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్లను విచారణ జరిపితే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని పలువురు సామాజికవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు..

నిషేదిత జాబితాలో ఉన్న భూములను సులువుగా రాత్రి వేళలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బు, అధికారం ఉంటే ఏదైనా కబ్జాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు అని నిరూపించిన ఈ సంఘటనలు, అరాచకాలు ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కనబడటం లేదా అని వీరి బారిన పడి కార్యాలయాల చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మునుత్ ట్రస్ట్ ను పావుగా వాడుకొని, నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు నకిలీ పత్రాలు సృష్టించి.. చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై తక్షణ చర్యలు చేపట్టాలని.. లేనిపక్షంలో బాధితులంతా ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. మంత్రి దామోదర రాజనర్సింహ గారూ మీ ఇలాఖాలో ఇంత భారీ తతంగం జరుగుతూ ఉంటే.. ఈ అక్రమ వ్యవహారం మీ దృష్టికి రాలేదా..? ఇలాంటి అరాచక, అక్రమాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు..? గూడెం మైపాల్ రెడ్డి ఇలాకలో మీరు అక్రమాలను కట్టడి చేయలేరా..? వారి కబ్జాలను ప్రశ్నించలేకపోవడం ఏంటని స్థానికులు చర్చించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. కళ్లెదుటే నకిలీ పత్రాలు సృష్టించారని, చేస్తున్నవి కబ్జాలు అని తెలిసినా వీరిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇప్పటికైనా మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించి.. మీ ఇలాఖాలో జరుగుతున్న ఈ కబ్జాలను కట్టడి చేసి, అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వీరిపై చట్టరీత్యా చర్యలు అమలయ్యేలా చూసి.. కబ్జాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలని అమీన్ పూర్ వాసులు వేడుకుంటున్నారు.. పఠాన్ చెరు నియోజకవర్గంలో గూడెం మధుసూదన్ రెడ్డి చేసిన కబ్జాలు.. సృష్టించిన నకిలీ పత్రాలు.. చేస్తున్న అక్రమాలు.. నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’ ..

Latest News

ఎవరికోసం.. ఈ విస్తరణ

పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు.. పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్‌ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన.. అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు పంచాయతీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS