Wednesday, July 23, 2025
spot_img

మైనంపల్లి పై నోరు జారితే ఖబర్దార్

Must Read

జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పై నోరు జారితే ఖబర్దార్ అంటూ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం దుండిగల్ గండి మైసమ్మ చౌరస్తాలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి నాయకులు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు మైనంపల్లి హనుమంతరావు చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారు ఆయనను విమర్శించడం వారి అవకాశవాధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంటి చేతితో బిఆర్ఎస్ పార్టీ ని విజయతీరాలకు నడిపించినటువంటి వ్యక్తిపై కుప్పి గంతలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగిన విషయాన్ని మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకుడిని అంటూ చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ ఉద్యమకారులను మరచి తన కుటుంబ సభ్యులకే రాజకీయ భవిష్యత్తును కల్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి హనుమంతరావు పై అనిచిత వాక్యాలు చేస్తే సహించబోమని మరోసారీ పిచ్చిగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోరంపేట్ మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, డిపిపల్లి మాజీ సర్పంచ్ తలారి యాదగిరి, గాగిల్లాపూర్ శంకర్, తులసి రెడ్డి, కొత్తగూడెం యాదగిరి, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS