Tuesday, November 12, 2024
spot_img

ఉప్పల్‌ స్టేడియంకు ఐపీఎల్‌ అవార్డు!

Must Read

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు ఐపీఎల్‌ అవార్డు దక్కింది. బెస్ట్‌ పిచ్‌, బెస్ట్‌ గ్రౌండ్‌గా ఉప్పల్‌ స్టేడియంను అవార్డు వరించింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఈ అవార్డును అందుకుంది. అంతేకాదు 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ కూడా దక్కింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చాముండేశ్వరి నాథ్‌.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావుకు అవార్డును అందించారు.ఐపీఎల్‌ 2024లో ఉప్పల్‌ స్టేడియంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో బ్లాక్‌ బస్టర్‌ మ్యాచ్‌లను ఉప్పల్‌ స్టేడియం అందించింది. చాలా మ్యాచ్‌లు చివరి వరకు ఉత్కంఠంగా సాగాయి. ఉప్పల్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 277/3 స్కోర్‌ నమోదు చేసింది. ఉప్పల్‌ మైదానంలో జరిగిన ప్రతి మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS