Saturday, February 22, 2025
spot_img

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు

Must Read
  • సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు
  • జాడాలేని అధికారులు

అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన పడిన గొర్రెలను మేకలను కోసి అమ్ముతున్న వ్యక్తినీ రెడ్‌ హ్యాండెడ్‌ గా స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం బ్రహ్మణపల్లి చౌరస్తా మార్కెట్‌లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం బ్రహణపల్లి చౌరస్తాలో గత ఏడాది కాలంగా కొత్తగా మార్కెట్‌ జరుగుతుంది. మార్కెట్‌ సక్సెస్‌ గా నడుడుస్తుందడంతో కొందరు కల్తీ వ్యాపారానికి తెరతీశారు. పుల్కల్‌ మండలం సింగూరు గ్రామానికి చెందిన ముజాయిత్‌ బ్రహ్మాణపల్లి మార్కెట్‌ లో గత కొంత కాలంగా మటన్‌ మార్కెట్‌ కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఏ షాపులో అయిన మటన్‌ మాంసం కిలో ధర ఐదు వందల రూపాయలకే దొరుకుతుంది. తక్కువ ధరకు మాంసం విక్ర‌యిస్తుండ‌డంతో చుట్టూ పక్కల 10 గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లి మాంసం కొంటారు. మటన్‌ ధర తక్కువ ఉండడంతో పండుగొస్తే చాలు ఇక్కడ చాలా మంది వచ్చి మటన్‌ మాంసం కొంటారు. కటికే ముజాయిత్‌ మార్కెట్‌ లో చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న గొర్రెల మాంసం అమ్ముతూ శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. మాంసం పూర్తిగా వాసన రావడంతో నేరడిగుంట గ్రామానికి చెందిన శ్రీదర్‌ రెడ్డి నిలదీశాడు. చనిపోయిన గొర్రెలు ఎలా అమ్ముతావు మాసం మేము కొనడంతో మా ఆరోగ్యాలు దెబ్బతింటాయాని నిలదీశాడు. షాపులో తలుపు తీసి చెక్‌ చేయగా కొన ఊపిరితో ఉన్న గొర్రె చివరి ప్రాణంతో కొట్టుకుంటుంది. దీంతో గ్రామస్తులంతా కల్తీ మాంసం అమ్మడమే కాకుండా చనిపోయిన గొర్రెలు కొస్తావా అని షాప్‌ ముసివేశారు. కల్తీ మాంసంపై గ్రామ సెక్రటరీకి అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కల్తీ మాంసం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS