Friday, July 4, 2025
spot_img

“ఇంద్ర” రీరిలీజ్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన

Must Read

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో ” ఇంద్ర ” చిత్రం ఒకటీ.ఈ చిత్రానికి బీ.గోపాల్ దర్శకత్వం వహించారు.అప్పట్లో భారీ వసూళ్లను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది.చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న మరోసారి ” ఇంద్ర “చిత్రం అభిమానుల ముందుకు రానుంది.ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సంధర్బంగా చిరంజీవి ఓ వీడియొను రిలీజ్ చేశారు. ” ఇంద్రసేన రెడ్డి అంటుంటే ఒళ్లు గగుర్లు పొడుస్తుంది.రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఆ సినిమాకి ఉన్న పవర్ అలాంటిది..ఇంద్ర అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమా కథ..అలాగే ఆ సినిమా చిత్రం కోసం పని చేసిన వారంతా మనసు పెట్టి పని చేశారు..అందుకే ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు.ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటారు.ఏ సీన్ నుంచి మొదలపెట్టిన చివరి వరకు చూస్తాం..అదే ఆ కథ గొప్పతనం..22 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం మళ్ళీ రీరిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.. 2002 జులై 22 ఇంద్ర రిలీజ్ అయింది..అప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఉంది అందరూ ఎంజాయ్ చేయండి” అని అన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS