Thursday, July 3, 2025
spot_img

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ మోటివ్ ఫర్ మర్డర్

Must Read

తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా, సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌ నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫ‌రెంట్‌గా..నా రూటు వేరు అన్నట్లు ఉంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెర‌కెక్కించిన‌ట్టు చెప్పారు. స‌రికొత్త‌ సస్పెన్స్ థ్రిల్లర్ స‌బ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవ్వ‌బోతోంద‌న్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయి నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే M4Mను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు.టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ ప‌వ‌న్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా ప‌నితనం. వంటి త‌మ టీమ్ వ‌ర్క్‌ హాలీవుడ్ రేంజ్‌లో వ‌చ్చాయ‌ని ప్ర‌శంసించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS