Saturday, February 22, 2025
spot_img

పిసిబి అవినీతి అధికారి బదిలీ

Must Read
  • నూతన అధికారిగా వెంకన్న నియామకం
  • దివిస్‌తో కుమ్మకు అయినందుకు బహుమానం
  • రైతులు వరుస ఫిర్యాదులు.. ప్రమోషన్‌కు బ్రేక్‌
  • ఎట్టకేలకు చర్యలు చేపట్టిన అధికారులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌గా బదిలీపై వచ్చిన సంగీత నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి

దివిస్‌ దెబ్బకు సంగీత బదిలీ :
కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి సంగీత దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమకు అనుకూలంగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లో కేసుకు సంబంధించి దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చినారు పరిశ్రమ గ్రామాల ప్రజలు దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు గీత కార్మికులు ఫిర్యాదులు చేసినారు అందుకు సంబంధించి కోర్టులో కేసులు వేసినారు నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారి సంగీత కనీసం దివిస్‌ ల్యాబ్స్‌ కాలుష్యబాధిత గ్రామాల ప్రజలను ఫిర్యాదుదారులను సంప్రదించకుండా దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ యజమాన్యంతో కుమ్మకై ఏకపక్షంగా దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో కేసును కొట్టి వేసినారు.

రైతులు గీత కార్మికుల ఫిర్యాదుతో బదిలీ :
దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ యజమాన్యంతో కుమ్మక్కై దివిస్‌ పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చినారని నల్లగొండ జిల్లా పర్యావరణ ఇంజనీర్‌ సంగీత పై చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి,పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి,మెంబర్‌ సెక్రటరీ గార్లకు రైతు చప్పిడి లింగారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ యజమాన్యంతో కుమ్మక్కైన సంగీత ను బదిలీ చేయడం జరిగింది.

నల్లగొండ పీసీబీ ఈఈగా వెంకన్న నియామకం :
గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతీయ అధికారిగా పనిచేసి రంగారెడ్డి జిల్లా పర్యావరణ ఇంజనీర్‌ గా రాష్ట్ర కార్యాలయంలో లీగల్‌ సెల్లో పని చేస్తున్న వెంకన్న గారిని నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్గా బదిలీపై రావడం జరిగింది గురువారం నాడు బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన పర్యావరణ ఇంజనీర్‌ వెంకన్న గారి ద్వారా ఆయన దివిస్‌ ల్యాబ్స్‌ పై చర్యలు చేపట్టి దివిస్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ గ్రామాల ప్రజారోగ్యాన్ని కాపాడతారని రైతులు గీత కార్మికులు ఆశిస్తున్నారు

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS