- కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి
- కళాశాలలను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు ..
- ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం
- నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
- విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు శూన్యం
- ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్
రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్ కాలేజీల పైశాచికత్వానికి తమను తాము బలిచేసుకుంటుంటే సిస్టం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధంకావడంలేదు.. తమ బంగారు భవిష్యత్తుపై ఎన్నో బంగారు కలలుగన్న విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యమని ఎందుకు భావిస్తున్నారో తెలియడంలేదు.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. లెక్కకు మించి. ఇవి కార్పొరేట్ కాలేజీల ర్యాంకులు కాదు.. కాలేజీల పైశాచికత్వానికి బలయిన విద్యార్థుల సంఖ్యలు.. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి బలవుతుంటే ప్రభుత్వాలు, ఇంటర్ బోర్డు దృష్టిసారించకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈరోజువి కాదు.. కొన్నెండ్లుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు తమ తనువులను చాలిస్తూ.. తమని కన్నవారికి శోకాలను మిగులుస్తూనే ఉన్నారు. దీనికి గల కారణాలు కోలువుదీరుతున్న ప్రభుత్వాలు గాని ఇంటర్ బోర్డు గాని నేటివరకు అన్వేషించలేదు.. మన దేశంలో ఓ విదేశీయురాలు చనిపోతే విదేశియురాలు ప్రాంతానికి చెందిన ప్రభుత్వం వెంటనే ఓ కమిటీని వేసి ఇండియాకు పంపింది.. మన దేశంలో మన రాష్ట్రంలో చనిపోయిన అమ్మాయి చావుకు గల కారణాలను అందుకు బాద్యులైన వ్యక్తులను మనం ఎందుకు శిక్షించలేకపోతున్నామో అర్ధం కావడంలేదు ..
కార్పొరేట్ కాలేజీలకు డబ్బులు కావాలి.. ఎవరు ఎలా చస్తే వారికేంటి..?
వారి సంస్థలో జరుగుతున్న ఆత్మహత్యలపై కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు విచారణ వ్యక్తం చేసిన సందర్బాలు ఒక్కటంటే ఒక్కటి కూడాలేదు..కనీసం పిల్లల ఫీజులు కూడా కార్పొరేట్ సంస్థలు రిటన్ చేయవు ..వాళ్ళ పిల్లలు ఎలా చనిపొయారో అన్నది మిస్టరీ గానే ఉంచుతారు..మృత దేహాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా వారి అనుమతి లేకుండానే కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక వాహనం మాట్లాడి విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి పంపిచేస్తారు ..విచిత్రమేటంటే ఇదేమి తప్పుకానట్లు అందరు చోద్యం చూస్తూ..ఉండిపోతారు..ఇదెక్కడి న్యాయం..
ఫిర్యాదు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం
కార్పొరేట్ కాలేజీల పైచాచికత్వాన్ని, నిబంధనలకు విరుద్ధంగా వారి చర్యలు వివరిస్తూ వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక బ్యూరో రిపోర్టర్ వాసుకుమార్ గతవారం తేదీ 14.02.2025 న ఇంటర్ బోర్డు డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది…కానీ ఇంటర్ బోర్డు డైరెక్టర్ కనీసం మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో వెనుదిరగడం జరిగింది..విచిత్రమేటంటే అందులో పనిచేస్తున్న పీఆర్, డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది ఫోన్ నంబర్ ఇవ్వడానికి కూడా బయపడుతున్నారు .దీనిబట్టి చూస్తుంటే అనిపిస్తుంది… ఇంటర్ బోర్డు ఎంత అవినీతిలో కూరుకునిపోయిందొ అనని..