Wednesday, January 15, 2025
spot_img

భూభారతితో సమస్యలకు చెక్‌

Must Read
  • కెసిఆర్‌ ఇష్టానుసారంతో ధరణి సమస్యలు
  • మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి

ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి తండాలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా భూ భారతి చట్టం రూపుదిద్దుకుంటుదన్నారు. భూ భారతిని గవర్నర్‌ కూడా ఆమోదించారని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇష్టారీతిన ధరణి అమలు చేసిందని.. కనీస నిబంధనలు కూడా లేకుండా ధరణి అమలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15 లోగా భూ భారతి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2029లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవుతారని.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. అందరికీ తెల్ల రేషన్‌ కార్డులు అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం ఇస్తుందని ప్రకటించారు. రాజకీయంగా కూడా అందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. అటవీ హక్కుల ప్రకారం మిగిలిన గిరిజనులకు భూములు ఇస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం అందరం కలసి పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఒకటి రెండు హావిూల అమలు ఆలస్యం అయిందని అన్నారు. త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హావిూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద కుటుంబాన్ని ఒక యూనిట్‌గా ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఆ కుటుంబం తప్పని సరిగా ఉపాధి హావిూ పనుల్లో పాల్గొని ఉండాలని.. అంతకుమించి నిబంధనలు ఏవిూ ఉండవని చెప్పారు. భూ భారతి విషయంలో చాలా పకడ్బందీగా చర్యలు ఉంటాయని అన్నారు. ఏపీ వ్యాప్తంగా రిజిస్టేష్రన్ల శాఖను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై శాఖా పరమైన విచారణ జరుగుతోందని చెప్పారు. 2025 భూ భారతి చట్టంలో ల్యాండ్‌ అప్పీలు అధారిటీని ప్రత్యేకంగా అమలు జరుపుతున్నామని చెప్పారు. సమగ్ర సర్వేపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 59 జీఓ ద్వారా కోట్లాది రూపాయల విలువైన భూములు పిక్‌ షర్ట్‌లకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో 59 జీఓ పేరుతో జరిగిన దోపిడీని అడ్డుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS