- పి.సి.బిలో సమర్ధుడైన అధికారిని పెట్టండి
- కాలుష్య పరిశ్రమలకు కొమ్ముకాస్తున్న అధికారులు
- కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు హైకోర్టు
- దివిస్ కాలుష్య బాధిత రైతుల ఘోష
- నల్గొండ ఈఈ అరాచకాలు భరించలేకపోతున్నాం
- అవినీతి అధికారిపై చర్యలేవి
- మేము కాలుష్యంతో చస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఉంటారా.?
- పేరు మార్చితే మూడు లక్షలు డిమాండ్
- ఉన్నతాధికారులకు వాటాలంటూ వసూళ్ల దందా
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. ఆ మాత్రం ఉంటుంది వాళ్ల డ్యూటీ మైండ్. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ లక్షలు జీతాలు తీసుకునే పీసీబీ అధికారులు కాలుష్య కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. లక్షలు లక్షలు మాముళ్లు తీసుకుంటూ వారికి కొమ్ముకాస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరుగా బదిలీపై వచ్చిన పర్యావరణ ఇంజనీరు. ఓ వైపు మూడు జిల్లాల కలెక్టర్లు పరిశ్రమ యాజమాన్యాలకు, మరోవైపు పరిశ్రమల కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు, గీత కార్మికులు ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి అధికారి పని తీరుతో విసిగిపోతున్నారు. అయినా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు చూసి ప్రజలు, కాలుష్య బాధిత రైతులు, ప్రజలు పిసిబి అధికారులకు కచ్చితంగా గిన్నిస్ బుక్ లో చోటు కల్పించే విధంగా చూడాలని పిసిబి అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారని పేరుకు తగ్గట్టు తెలంగాణలో నిత్యం రాష్ట్ర, జోనల్, ప్రాంతీయ కార్యాలయాలకు నిత్యం 20కి పైగా కాలుష్య సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఫిర్యాదులు కోర్టు కేసులు ఉన్న పరిశ్రమ దివిస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామంలో ఉన్న దివిస్ లాబరేటరీస్ పరిశ్రమ కాలుష్యంపై దివిస్ యజమాన్యం నిబంధనల ఉల్లంఘన పై వందల సంఖ్యలో ఫిర్యాదులు, కోర్టు కేసులు ఉన్న పరిశ్రమ దివిస్ మాత్రమే. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ గా పనిచేస్తున్న అధికారి దృష్టి జిల్లాలోనే అతిపెద్దదైన భారీ పరిశ్రమ దివిస్ ల్యాబ్స్ పై పడింది. గత ఆరు సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ లో రైతులు పరిశ్రమపై కేసు వేసినారు వెంటనే దివిస్ ల్యాబ్స్ యజమాన్యం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు అయినా రైతులు పట్టు విడువక సుప్రీంకోర్టు నుండి తెచ్చుకున్న స్టేట్ ను రద్దు చేయించారు.
దివిస్ కు ఎన్జీటీలో క్లీన్ చిట్ :
దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో ఉన్న కేసుకు సంబంధించి గత 6 సంవత్సరాలలో పర్యావరణ ఇంజనీర్లుగా పనిచేసిన ఎవరు దివిస్ పరిశ్రమకు అనుకూలంగా ఎన్జీటీ కోర్టుకు దివిస్ కు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదు ప్రస్తుతం పని చేస్తున్న అధికారి మాత్రం దివిస్ ల్యాబ్స్ యజమాన్యం ద్వారా ఏ ప్రయోజనాలు ఆశించినారో దివిస్ కు అనుకూలంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ లో ఉన్న కేసు నెంబర్ 80/2020 కి సంబంధించి దివీస్ ల్యాబ్స్ లో కాలుష్యం లేదని నివేదిక ఇవ్వడం వల్ల న్యాయస్థానంలో దివిస్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. రైతుల లక్షల రూపాయల డబ్బు ఖర్చు మరోవైపు న్యాయస్థానంలో తీర్పుతో మాకు న్యాయం చేసేది ఎవరని రోధిస్తున్నారు.
చౌటుప్పల్ వీధుల్లో బిక్షమెత్తి డబ్బు ఇస్తాం :
కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు రైతుల ప్రజల కన్నా డబ్బే ముఖ్యమనుకుంటే మా బతుకులు బాగుపడడం కోసం ఎవరు చేయడానికి ఇష్టపడని పని అయినా చౌటుప్పల్ మండల పరిధిలో గల ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి భిక్షాటన చేసి అయినా డబ్బులు పోగు చేసి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు డబ్బు ప్రధానం అనుకుంటే చివరికి భిక్షాటన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా రైతుల కుటుంబాలను నాశనం చేసిన ప్రభుత్వాలే ఉనికి లేకుండా పోయాయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాల ఉసురు తప్పకుండా తగులుతుంది. మేము మాత్రం దివిస్ కాలుష్యంతో నష్టపోయిన రైతులకు, గీత కార్మికులకు 500 కోట్లు నష్టపరిహారం లభించే వరకు దివిస్ పరిశ్రమ యజమాన్యంపై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న దివిస్ పరిశ్రమకు సహకరిస్తున్న అధికారులపై పోరాడుతూనే ఉంటామని రైతులు తెలుపుతున్నారు.
నిజాయితీ అధికారిని పంపండి :
కాలుష్య నియంత్రణ మండలిలో సుమారు 200 మంది వరకు అధికారులు ఉన్నారు అందులో సమర్ధులైన నిజాయితీపరుడైన అధికారిని నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా నియమించి ప్రస్తుతం రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే దివిస్ ల్యాబ్స్ కు అనుకూలంగా న్యాయస్థానానికి నివేదిక ఇచ్చిన పర్యావరణ ఇంజనీర్ ను వెంటనే బదిలీ చేయండి లేదా దీర్ఘకాలం పాటు సెలవు పై పంపించి పుణ్యం కట్టుకోండి అంటూ దివిస్ కాలుష్య బాధిత రైతులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
పేరు మార్చితే మూడు లక్షలు :
నల్లగొండ జిల్లాలో గతంలో ఉన్న కొన్ని పరిశ్రమల ను వాటి యజమాన్యాలు ఇతర సంస్థలకు విక్రయించినారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన పరిశ్రమల పేర్లు కాలుష్య నియంత్రణ మండలి రికార్డులలో మార్చాలంటే ఖచ్చితంగా నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారి రిపోర్ట్ పంపించవలసి ఉంటుంది. అలా 11 పరిశ్రమల పేర్లు మార్చడానికి ప్రస్తుతం నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రతి పరిశ్రమ నుండి మూడు లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నల్లగొండ జిల్లాలో ఒక పరిశ్రమ యజమాని తన సోషల్ మీడియాలో పర్యావరణ ఇంజనీర్ అవినీతిపై పోస్ట్ చేశాడంటే బయటికి రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయని ఏ స్థాయిలో వసూళ్ల దందా కొనసాగుతుందోనని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తూంకుంట గ్రామ పరిధిలో గల సిలికాన్ ప్లానెట్ పరిశ్రమలో ఎలాంటి ఉత్పత్తులు గత ఆరు నెలలుగా నిర్వహించడం లేదు. నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ పరిశ్రమను సందర్శించి మూసివేసిన పరిశ్రమకు సిఎఫ అనుమతులు జారీ చేయడమే కాకుండా అదనంగా అదనపు ఉత్పత్తులకు అనుమతులు జారీ చేసినారు కొండమడుగు దగ్గర బ్యాటరీ పరిశ్రమ నుండి నెలకు లక్ష రూపాయలు నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ కు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. బ్యాటరీ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు అయినా అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి పూర్తిగా కాలుష్య పరిశ్రమలకు సహకరిస్తూ ప్రజాప్రయోజనాలు దెబ్బతీస్తున్నందున వెంటనే బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైకోర్టు గత ఏడాది కాలంగా పలు కేసుల విచారణ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ చేయవలసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాలుష్య పరిశ్రమలకు సహకరిస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రస్తుతం నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అవినీతి అక్రమాలపై ఆరోపణలు వస్తున్న ప్రముఖ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తునందున వెంటనే నల్లగొండ నుండి బదిలీ చేసి పంపించకుండా ఉన్నారంటే ఉన్నతాధికారులు ఏ ప్రయోజనాలు ఆశించి నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. పిర్యాదులు విచారించడం లేదని ప్రతిదానికి లక్షలు వెచ్చించి న్యాయస్థానాలకు వెళ్తే తప్ప అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన అధికారిపై చర్యలు తీసుకోరా అని ప్రజలు ప్రజాప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మారేదేన్నడు తెలంగాణ రాష్ట్రం కాలుష్య శృంఖలాల నుండి విముక్తి అయ్యేది ఎప్పుడు అని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు.