Wednesday, January 15, 2025
spot_img

ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

Must Read

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. భారత దేశం లో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్ లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా ఉన్నాయి. జపనీస్ యానిమే స్టైల్ లో ఈ ట్రైలర్ ని రూపొందించడం జరిగింది. యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్ లు అందరూ కలిసి ఈ సినిమా ని మన ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా 450 ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని రూపొందించారు. “ఈ సినిమా భారత దేశం లోని గొప్ప కథ ని ట్రిబ్యూట్ లాగా భావిస్తున్నాం.” అని మోక్ష మోడిగిలి తెలిపారు. ఈ సినిమా కి నిర్మాత గా పని చేసిన అర్జున్ అగర్వాల్, “ఇండియన్ హెరిటేజ్ ని గొప్ప గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా ఈ రామాయణం సినిమా ని రూపొందించాం. కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమా ని అందరూ ఎంజాయ్ చేస్తారు.” అని చెప్పాడు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఈ రాయణం కథ ఎంతో మంది భారతీయుల్ని కదిలించింది . కచ్చితంగా ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా ని చేసాం.” అన్నారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS