Sunday, February 23, 2025
spot_img

పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

Must Read
  • కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. స్వచ్ఛ నిర్మల్‌ జిల్లా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖానాపూర్‌ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణం లోని పదవ వార్డులో డ్రైనేజీలను, రోడ్డు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైనేజీలో చెత్త వేయవద్దని పరిసరాల పరిశుభ్రతను తప్పక పాటించాలని కలెక్టర్‌ సూచించారు. కాలనీలో పరిశుభ్రత లోపించకుండా ఎప్పటికప్పుడు మురికి కాలువను శుభ్రపరుస్తూ ఉండాలని పారిశుద్ధ్య కార్మికులను సూచించారు. ప్రతి వార్డులో తప్పనిసరిగా శానిటైజేషన్‌, దోమల స్ప్రే, చేయాలని మున్సిపల్‌ అధికారులను సూచించారు. పారిశుద్ధ కార్మికులు సరిjైున సమయ పాలన పాటిస్తూ పనిచేయాలన్నారు.

కుంట సమస్యను పరిష్కరిస్తాం
పట్టణంలోని శాంతినగర్‌ బుడ్డోని కుంట సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. స్థానిక కాలనీవాసులు కుంట సమస్య తీవ్రతను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. బుడ్డోని కుంట లోకి మురికి నీరు రావడంతో దోమల బెడద పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశా రు. సీజనల్‌ వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని వాపోయారు. త్వరలోనే తమ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి
అనంతరం మండలంలోని మస్కాపూర్‌ గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఎలాంటి ఒత్తిడి కు లోను కాకుండా పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ విద్యార్తినులను సూచించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. నిర్వహ ణను పక్కాగా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్త కుండా చూడాలనికలెక్టర్‌ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు ఉడక బెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు భోజనం తయారు చేసేందుకు వినియోగించే అహర పదార్థాలు సరుకులు కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను సూచించారు. దార్మటరి, స్టోర్‌ రూమ్‌ కిచెన్‌ ప్లే గ్రౌండ్‌ తదితర వాటిని పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాధికారి రామారావు, తహసిల్దార్‌ సుజాత, ఎంపీడీవో సునీ త, ఎంపీ ఓ రత్నాకర్‌రావు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest News

దండేకుంట దార్తిపాలు..

దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS