Thursday, August 14, 2025
spot_img

ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స

Must Read
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు
  • ఉదయ్ ఓమ్నీలో ‘అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ’ ప్రారంభం
  • ఆర్థోపెడిక్‌ వైద్యంలో ఇది ఒక విప్లవం
  • దక్షిణాదిలో అత్యాధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌ సేవలు
  • రోగి కేంద్రీకృత ఆర్థోపెడిక్‌ సేవలకు నాంది

ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని, త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు తెలిపారు. దక్షిణాదిలో ఆర్థోపెడిక్స్‌, ట్రామా కేర్‌లో ఉదయ్ ఓమ్ని ఎంతో పేరుగాంచింది. అబిడ్స్ చాపెల్ రోడ్డులో ఉన్న ఉదయ్ ఓమ్ని హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ‘అత్యాధునిక మిస్సో రోబోటిక్ వ్యవస్థ’ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత కచ్చితత్వంతో కూడిన మొదటి ఆర్థోపెడిక్‌ వ్యవస్థగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ తెలంగాణకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను తీసుకురావడంలో ముందంజలో ఉందన్నారు. ఇక్కడ రోబోటిక్ సర్జరీ ప్రారంభించడం వల్ల ఎంతో మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థోపెడిక్ సంరక్షణ ప్రమాణాలు మరింత పెరుగుతాయన్నారు. సాంకేతికత మానవ జీవితాల్లో సానుకూల మార్పునకు శక్తివంతమైన ప్రేరణగా మారిందన్నారు. ఆధునిక ఆవిష్కరణలతో వైద్య రంగంలో జరిగిన మార్పులు అద్భుతమైనవన్నారు. శస్త్రచికిత్స తర్వాత కలిగే ఇబ్బందుల నుంచి బయటపడిన రోగుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. నైపుణ్యం కలిగిన వైద్యుడి చేతుల్లో జీవితాన్ని మార్చే శక్తి ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సర్జరీలు ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 2030 నాటికి మార్కెట్ 18 బిలియన్లకల డాలర్లకు చేరుకుంటుందని అంచనా ఉందన్నారు. భారతదేశంలో ఈ వృద్ధి మరింత వేగంగా ఏటా 20 శాతంతో కొనసాగుతోందన్నారు. ఇది రాబోయే కాలంలో ఉన్న అపారమైన అవకాశాలు, భవిష్యత్తు సామర్థ్యాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆధునిక వైద్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చీఫ్, డైరెక్టర్, ఎఫ్ఆర్సీస్ (ట్రామా, ఆర్థో) యూకే డాక్టర్ ఉదయ్ ప్రకాశ్ మాట్లాడుతూ దక్షిణాదిలో ఆర్థోపెడిక్స్‌, ట్రామా కేర్‌లో ఉదయ్ ఓమ్ని యాబై ఏళ్లగా ఎంతో పేరు సంపాదించింది. శస్త్రచికిత్సలు చేయడంలో నాకు ముప్ఫై ఏళ్ల అనుభవం కలదన్నారు. ఈ మూడు దశాబ్దాలలో వేల మోకాలి, నడుమ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ అత్యాధునిక రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ విభాగంతో కచ్చితమైన సేవలు అందించవచ్చన్నారు. సంప్రదాయ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్సలలో అత్యుత్తమ ఫలితాలు ఉన్నాయన్నారు. అయినా, కొన్ని పరిమితులు కలవన్నారు. ఎంతటి నైపుణ్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణులైనా ఎముకల అమరికలో స్వల్ప తేడాలు, గ్యాప్‌ బ్యాలెన్స్‌లో అసమానతలు, కట్‌లలో కచ్చితత్వ లోపం, అధిక కణజాల నష్టం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇవి రోగి కదలిక సామర్థ్యం తగ్గిపోవడం, నిరంతర అసౌకర్యం, ఇంప్లాంట్‌ కాలం తగ్గిపోవడం వంటి సమస్యలకు దారి తీయవచ్చన్నారు. అధ్యయనాల ప్రకారం.. సరైన అమరిక, పటిష్టమైన ఫిక్సేషన్‌ వల్ల ఇంప్లాంట్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలు కలవన్నారు.

భారతీయులు స్వయంగా అభివృద్ధి చేసిన ఈ రోబోట్‌ ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ రోబోట్లతో పోటీ పడుతుందన్నారు. యూరప్‌, అమెరికా వైపు అడుగులు వేస్తోందన్నారు. ఇటలీకి చెందిన సర్జన్ల బృందం ఈ భారతీయ రోబోట్‌ను పరిశీలించడానికి మా హాస్పిటల్స్ ను సందర్శించబోతున్నారని తెలిపారు. సంప్రదాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో అత్యుత్తమ శస్త్రచికిత్స నిపుణులు చేసినా కూడా రోగులలో అసంతృప్తి ఎక్కువగానే ఉంటుందన్నారు. దీనికి కారణం.. ఈ పద్ధతిలో కాలు సరిపోలికను ఒకే విధంగా అందరికీ ఒకే సూత్రంతో సరి చేయడం అన్నారు. కానీ ప్రతి వ్యక్తి కాలి సరిపోలిక వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. అందువల్ల ‘ఒకే రకం అమరిక అందరికీ’ అనే పద్ధతి ప్రతి రోగికి సరిపోదన్నారు. శస్త్రచికిత్స తర్వాత కూడా అసౌకర్యాన్ని మిగులుస్తుందన్నారు. ఈ రోబోట్ మాత్రం ప్రతి రోగి సహజ సరిపోలికను పునరుద్ధరిస్తుందన్నారు. దీంతో రోగి సౌకర్యంగా ఉంటారన్నారు. మోకాలి ప్రతి కదలికలోనూ బ్యాలెన్స్‌ లో ఉంచుతుందన్నారు, రోగి సహజంగా నడవడానికి అనువుగా ఉంటుందన్నారు. జీవన విధానాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ రోబోట్‌ 12 నుంచి 24 నెలల్లో వెన్నెముక, నడుము, పాక్షిక మోకాలి మార్పిడి, ట్రామా చికిత్స వంటి శస్త్రచికిత్సలు కూడా చేయగలదన్నారు. రోబోటిక్ కచ్చితత్వం కీళ్ల మార్పిడి చేసే విధానాన్ని మారుస్తుందన్నారు. ఇది సంపూర్ణ సమతుల్యతతో కూడిన కీళ్లను అందించడానికి, కణజాల నష్టాన్ని తగ్గించడానికి, రోగులకు నొప్పి లేకుండా, ఆనందకర జీవితాన్ని గడపడానికి ఉత్తమ అవకాశాన్ని ఇస్తుందన్నారు.

ఈ అత్యాధునిక రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ ఆ లోపాలను పూర్తిగా నివారిస్తుందన్నారు. ఇది అత్యంత కచ్చితత్వంతో ఎముకను కట్ చేస్తుందన్నారు. గ్యాప్‌ బ్యాలెన్సింగ్‌, ఇంప్లాంట్‌ పొజిషనింగ్‌లో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్‌ చేస్తుందని చెప్పారు. ఈ మినిమల్ ఇన్వాసివ్ విధానం కణజాల నష్టం, శస్త్రచికిత్స తర్వాత సమస్యలను గణనీయంగా తగ్గిస్తుందన్నారు. తక్కువ నొప్పి, త్వరిత రికవరీ, తక్కువ ఇన్ఫెక్షన్ ఈ విధానంలో ఉన్న ప్రయోజనాలు అన్నారు. ఈ వ్యవస్థ రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ మానవ తప్పిదాలను తగ్గిస్తుందన్నారు. మిస్సో రోబోటిక్ వ్యవస్థ పూర్తిగా దేశీయమైనదన్నారు. ప్రపంచంలోని ఉత్తమ వ్యవస్థలతో పోటీ పడుతోందన్నారు. త్వరలో ఇదే రోబోటిక్ వ్యవస్థతో పాక్షిక మోకాలి, మొత్తం నడుమ మార్పిడి శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు.

కచ్చితత్వంపై ఆధారపడిన ఈ శస్త్రచికిత్సలో ముందుగా 3డీ సీటీ స్కాన్‌ నిర్వహించనున్నామని చెప్పారు. సరిగ్గా ఎముక, కీళ్ల మోడల్‌ రూపొందిస్తామన్నారు. అనంతరం కంప్యూటర్‌ ఆధారిత శస్త్రచికిత్స ప్రణాళిక సిద్ధం చేసి, ఆ మోడల్‌ను రోబోటిక్‌ సిస్టమ్‌లో సమీకరిస్తారన్నారు. తర్వాత చిన్న చీలిక చేసి ఎముక రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, రియల్‌టైమ్‌ గ్యాప్‌ బ్యాలెన్సింగ్‌తో అత్యంత కచ్చితత్వంతో ఎముక కట్టింగ్‌ జరుగుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కణజాల నష్టం చాలా తక్కువగా ఉండటం వల్ల రోగి త్వరగా కోలుకుంటారన్నారు. రోబోటిక్‌ శస్త్రచికిత్స సమయం మాన్యువల్‌ పద్ధతితో పోలిస్తే కాస్త ఎక్కువైనా రోగికి అనుకూలమైన త్వరిత రికవరీ, తక్కువ సమస్యల వంటి ప్రయోజనాలు కలవన్నారు. ఈ కచ్చితమైన అమరిక వల్ల ఇంప్లాంట్లు సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే, వీటిపై ఒత్తిడి తక్కువగా ఉంటుందన్నారు. భారతదేశంలో పూర్తి స్థాయి ఆటోమేటెడ్‌ రోబోటిక్‌ మోకాలి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న అతి కొద్ది కేంద్రాలలో ఉదయ్ ఓమ్ని ఒకటన్నారు. ఈ అధునాతన సేవలను తెలంగాణ, దక్షిణాది రోగులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఉదయ్ ఓమ్ని హాస్పిటల్‌ ఈ నెలాఖరులో అత్యాధునిక క్యాత్‌ ల్యాబ్‌ను ప్రారంభించనుందన్నారు. గుండె చికిత్స సేవలను మరింత బలోపేతం చేయనుందని చెప్పారు. అదనంగా, కృత్రిమ మేధ ఆధారిత డయాగ్నస్టిక్‌ సాంకేతికతను అనుసంధానం చేయడం, మినిమల్‌ ఇన్వాసివ్‌ శస్త్రచికిత్సలను విస్తరించడం, శస్త్రచికిత్స అనంతర కోలుకోవడం, పునరావాసాన్ని మెరుగుపరచడం, అధునాతన ఫిజియోథెరపీ విభాగాలను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఉదయ్ ఓమ్ని హాస్పిటల్‌ను 1974లో డాక్టర్‌ వేద్‌ ప్రకాశ్‌ స్థాపించారు. ఆర్థోపెడిక్స్‌, స్పైన్‌ సర్జరీ, ట్రామా కేర్‌, పీడియాట్రిక్‌ ఆర్థోపెడిక్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ రంగాల్లో ఎంతో పేరు గడించింది. నైతిక వైద్య సేవలను అత్యాధునిక సాంకేతికతతో మేళవిస్తూ.. భారత్‌లోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే రోగులకు సేవలందిస్తూ విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచింది.

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS