దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకులు
తెలుగు భాషకే వన్నెతెచ్చిన పద్యం ద్వారా తెలుగు భాషలో పట్టు, భాషా సౌందర్యం, జీవన విలువల బోధన, భాషపై మక్కువ లాంటివి అనుభవంలోకి వస్తాయని తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. నాగేశ్వర డిగ్రీ, పిజీ కళాశాల సమావేశ మందిరంలో...
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తెలుగువారు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ (టీబీడీ) సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ వేడుకలను సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా-సెంట్రల్) నిర్వహిస్తుంది. సంబరాలకు ముందుగా ఏర్పాటుచేసే క్రీడా పోటీల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారతీయ అంతర్జాతీయ పాఠశాల(ఐ.యస్.ఆర్) క్యాంపస్‌లో లేటెస్ట్‌గా నిర్వహించిన పోటీల్లో...
మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...
అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు...
భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును...