Monday, August 18, 2025
spot_img

కాలుష్యంతో చచ్చిపోతున్నాం

Must Read
  • కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి
  • కంపెనీలు మూసివేయాలని నిరాహార దీక్ష
  • పరిశ్రమలతో పీసీబీ అధికారుల కుమ్మక్కు
  • కోర్టులకు తప్పుడు నివేదికలు పంపుతున్న వైనం
  • అవినీతి అధికారులపై చర్యలు శూన్యం
  • బృందావన్ పరిశ్రమకు అధికారుల అండదండలు

తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య(pollution) కాసారాలు వెదజిమ్ముతున్న కంపెనీలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఇంకింత ఎక్కువే అవుతున్న.. చర్యలు తీసుకోవడం లేదు. విషం చిమ్ముతున్న పరిశ్రమలతో ప్రజలు చస్తూ బతుకుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారిన కంపెనీల ఆగడాలు తగట్లే. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామ పరిధిలో గల ఫార్మ, కెమికల్ పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాల నిర్వహణ పూర్తిస్థాయిలో శుద్ధి చేయవలసి ఉండగా బహిరంగ ప్రదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా ట్యాంకర్ల ద్వారా గత 15 సంవత్సరాలుగా తరలిస్తూ పట్టుబడిన చర్యలు తీసుకోవడంలో మాత్రం కాలుష్య నియంత్రణ మండలి(pollution control board) అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమల యజమాన్యాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని నిరాహార దీక్ష :
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలో గల రావూస్ లాబరేటరీ, హేజోలో ల్యాబ్స్, వి.జే.సాయి కెమ్, ఎస్.వి.ఆర్ ల్యాబ్స్, ఆప్టిమస్ డ్రగ్స్, ఆర్కిమెడిస్ ల్యాబ్స్, కెమిక్ లైఫ్ సైన్సెస్, బృందావన్ లేబరేటరీస్, వినీత్ లాబరేటరీస్ పరిశ్రమల యజమాన్యాలు పర్యావరణ నిబంధనలు అమలు చేయకుండా వ్యర్ధాలను భూగర్భంలోకి వదలడంతో భూగర్భ జలాలు కలుషితం కావడంతో పరిసర ప్రాంతాల్లో కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. వ్యవసాయ పంటలు పండక పోవడంతో రైతులు పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్న దాఖలాలు ఉన్నాయి.

పీసీబీ అధికారులు కుమ్మక్కు :
కాలుష్య
నియంత్రణ మండలి అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ అధికారులు సైతం కాలుష్యం వెదజల్లే పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై తీసుకెళ్లిన నీటి నమూనాలకు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇవ్వడంతో చర్యలు చేపట్టలేకపోతున్నారు. నీరి, పీసీబీ అధికారులు కాలుష్య పరిశ్రమలకు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు.

కాలుష్యంతో చస్తున్నాం :
ఈ ప్రాంతంలో స్థాపించిన పరిశ్రమల కాలుష్యంతో నిత్యం చస్తూ బ్రతుకుతున్నామని నిరాహార దీక్షలో పాల్గొన్న రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలియడం లేదని అందుకే శాశ్వతంగా కాలుష్య సమస్య నుండి విముక్తి కలగాలంటే పరిశ్రమలు శాశ్వతంగా మూసివేయాలని కోరుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకోమన్నా చర్యలు తీసుకోరా బేరం కుదిరిందని ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి ఎంపీ, భువనగిరి ఎమ్మెల్యే ఇటీవల దోతిగూడెం పరిధిలోని పరిశ్రమలను అధికారులతో కలిసి సందర్శించినప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిసింది. మరుసటి రోజు నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ దోతిగూడెం పరిధిలోని పరిశ్రమల యజమానులతో సమావేశమై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే అన్ని పరిశ్రమలను మూసివేయాల్సి ఉంటుంది.

మూసివేస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్లు తెలిసింది. చివరకు బేరం కుదరడంతో నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి రిపోర్టులు పూర్తిగా దోతిగూడెంలోని అన్ని పరిశ్రమలకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ సంగీత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అందుకు సంబంధించి నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ సంగీతపై ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ సెలవుపై పంపారని జోరుగా చర్చ నడుస్తోంది. బృందావన్ లాబ్స్ పరిశ్రమపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర కార్యాలయ అధికారి బృందావన్స్ పరిశ్రమపై చర్యలు చేపట్టకుండా సహకరించడంలో లక్షల రూపాయలు చేతులు మారింది నిజమేనా అనే అనుమానాలు తలెత్తున్నాయి.

ఇక దోతి గూడెం పరిధిలోని బృందావన్ లేబోరేటరీ పరిశ్రమ కాలుష్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోర్టులలో కేసులు వేస్తున్నారని బృందావన్ లేబరేటరీ పరిశ్రమపై చర్యలు చేపట్టాలని కోరుతూ పర్యావరణ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేస్తున్నారు. బృందావన్ లాబోరేటరీ పరిశ్రమపై చర్యలు చేపట్టకుండా కేవలం టాస్క్ ఫోర్స్ ఎజెండాలో పెట్టి సూచనలు జారీ చేసేలా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అధికారి బృందావన్ లాబ్స్ పరిశ్రమకు సహకరించడానికి లక్షలాది రూపాయలు చేతులు మారాయని వచ్చిన ఆరోపణలు నిజమేనా పరిశ్రమ యజమాన్యం బహిరంగంగా చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు కాలుష్య పరిశ్రమలకు కొమ్ము కాస్తుంటే ఇంకా చర్యలు ఎలా తీసుకుంటారని పర్యావరణ సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దోతిగూడెం పరిశ్రమల నిబంధనల ఉల్లంఘనపై, కాలుష్య బాధిత రైతులకు మద్దతుగా 10 ఫార్మా పరిశ్రమలపై “ఆదాబ్” హైదరాబాద్ లో వరుస కథనాలు మీ ముందుకు…

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS