- జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షల నిర్వహణ
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగే ఈ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్- 1 మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో ఆరు రోజులు పేపర్ -2 పరీక్షలు జరగనుండగా.. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నాలుగు రోజులు పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 7 నుంచి 20 వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 2.75లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు సంబంధించిన హాల్ టికెట్లను టీజీ టెట్ కన్వీనర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మ. 12.30 గంటల నుంచి అనుమతించనున్నారు. ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు. అంటే ఉదయం సెషన్‌లో ఉ. 8.45కు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను మూసివేయనున్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డుల్లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీని తీసుకెళ్లాలి. స్మార్ట్ వాచీలతో పాటు ఎలాంటి ఎలక్టాన్రిక్ పరికరాలకు అనుమతి లేదు.