- ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థుల ఉత్తీర్ణత
- 1,37,429 మంది హాజరు
- 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై
- వివరాలు వెల్లడించిన విద్యాశాఖ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు.