Saturday, February 22, 2025
spot_img

దీవిస్ అంటేనే హడలిపోతున్న అధికారులు…?

Must Read
  • యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు
  • దీవిస్ చైర్మన్ తో కుమ్మక్కు ఫలితం
  • దీవిస్ అక్రమాలకు ఎంతమంది బలి కావాలి.
  • దీవిస్ కాలుష్యంతో 1200 గీత కార్మికులు ఉపాధికి గండి
  • వందల రైతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో
  • ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు, ఒక సర్వేయర్, ఇద్దరు పిసిబి అధికారులు ఒక
  • డిపిఓ, ఇద్దరు గ్రామ కార్యదర్శిలకు దివిస్ ఉచ్చు..?

యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో గల దీవిస్ లేబరేటరీ పరిశ్రమ చైర్మన్ తన స్వలాభం కోసం ప్రభుత్వ అధికారులకు తాత్కాలిక ప్రయోజనాలు ఆశ చూపి పనులు చేసుకోవడం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న తంతు.

దీవిస్ కు సహకరించిన పాపానికి బదిలీలు కేసులు:
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అనితా రాంచంద్రన్ కలెక్టర్ గా ఉన్న సమయంలో దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యం గోల్డెన్ పారెస్ట్ సంస్థకు చెందిన భూమిని 102 ఎకరాలు ఆక్రమించుకొని భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో రెవిన్యూ అధికారులు దివిస్ సంస్థకు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు ఒకే సర్వే నెంబర్ల లో భూమి హక్కులు కలిగి ఉన్నారని ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణాలపై విదారించి చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అనిత రామచంద్ర ఒత్తిడితో తప్పుడు సర్వే నివేదిక కలెక్టర్ పై ఫిర్యాదు, బదిలీ :
దీవిస్ ల్యాబ్స్ చైర్మన్ గోల్డెన్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే చర్యలు చేపట్టి నిర్మాణాలు నిలిపివేయాలని ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్ క్రింది స్థాయి అధికారులైన రెవిన్యూ డివిజనల్ అధికారిపై సర్వేయర్ వెంకన్న పై ఒత్తిడి చేయడంతో దీవిస్ కు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇచ్చినారని దివిస్ ల్యాబ్స్ కు ప్రయోజనాలు చేకూర్చినందుకు యాదాద్రి జిల్లా కలెక్టర్ కు భారీ ప్రయోజనాలు పొందినారని ఫిర్యాదులు వెళ్లడంతో అనితా రామచంద్రన్ ను బదిలీ చేసి మూడు నెలల పాటు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.

గోల్డెన్ ఫారెస్ట్ భూమి ఎక్కడ:
జిల్లా కలెక్టర్ ఒత్తిడితో దివిస్ చైర్మన్ కు అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు అసలు సమస్య దివిస్ చైర్మన్ గోల్డెన్ పారెస్ట్ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపడుతున్నారని రెవిన్యూ అధికారులు మాత్రం గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమిని మార్కింగ్ చేయలేదు భూమిని ఎందుకు తమ ఆధీనంలోకి తీసుకోలేదు దీనిని బట్టి తెలుస్తుంది అడ్డదారిలో దివిస్ చైర్మన్ అక్రమాలకు వంత పాడి 200 కోట్ల విలువ కలిగిన భూమిని దివిస్ చైర్మన్ కు అధికారులు కట్టబెట్టినారు అని తెలుస్తుంది.

యాదాద్రి అధికారులపై ఫిర్యాదులు, కేసులు :
దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు అడ్డదారిలో అక్రమాలకు సహకరించిన యాదాద్రి జిల్లా కలెక్టర్లు అనిత రామచంద్రన్, పమేలా సత్పతి ఆర్డీఓ లు, సూరజ్ కుమార్, ఉపేందర్, జిల్లా పంచాయతీ అధికారి సునంద కాలుష్య నియంత్రణ మండలి అధికారులు భద్ర గిరీష్, సురేష్, సంగీత చౌటుప్పల్ మండల సర్వేయర్ వెంకన్న, తహసిల్దార్ రవీంద్రసాగర్ అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులు యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుమారు డజన్ కి పైగ అధికారులు దీవిస్ ల్యాబ్స్ చైర్మన్ కు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇతర తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ అధికారులు విచారణ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు.

దివిస్ కాలుష్యంతో వందల కుటుంబాల ఉపాధికి గండి:
చౌటుప్పల్ మండలంలోని దివిస్ ల్యాబ్స్ పరిసర గ్రామాల ప్రజలు దివిస్ ల్యాబ్స్ కాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితం కావడంతో కల్లు కలుషితం జరగడంతో తాగే వారు లేకపోవడంతో గీత కార్మికులు సుమారు 1200 కుటుంబాలు ఉపాది కోల్పోయినారు రైతులు పెట్టిన పెట్టుబడులు రాక ఆర్ధికంగా నష్టపోతూ అప్పుల పాలవుతూ వ్యవసాయం చేసుకోలేక ఉన్న ఉపాధి కోల్పోయి కూలీలుగా బ్రతక వలసిన పరిస్థితి దివిస్ ల్యాబ్ చైర్మన్ దయవల్ల వందల కుటుంబాల బతుకులు రోడ్డుపాలైనవి.

దివిస్ ల్యాబ్స్ చైర్మన్ కు సహకరించిన పాపానికి శిక్ష :
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిజాయితీగా వ్యవహరించి దీవిస్ ల్యాబ్స్ కాలుష్యాన్ని నివారిస్తే 1200 కుటుంబాల గీత కార్మికులు వందల కుటుంబాల రైతులు బతుకులు నాశనం కాకుండా ఉండేవి దీవిస్ చైర్మెన్ తాత్కాలికంగా ఇతరుల బతుకులు నాశనమవుతున్న తాను మాత్రం వేలకోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకోవచ్చు వేలాది కుటుంబాలలో ఎవరో ఒకరి కడుపుకోత ఉసురు తగిలిందో ఏమో దీవిస్ చైర్మన్ కుటుంబానికి భగవంతుడు భారీ శిక్ష విధించి చైర్మన్ కు కడుపుకోతను విధించాడు దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు సహకరించి ప్రజల బతుకులు నాశనం చేసి తాత్కాలిక ప్రయోజనాలు పొందిన కాలుష్య నియంత్రణ మండలి అధికారి భద్ర గిరీష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిపాలై చస్తూ బ్రతుకుతున్నాడు నిన్న మొన్నటి వరకు నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారిగా పని చేసిన సురేష్ దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దివిస్ ల్యాబ్స్ కాలుష్య బాధితులు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నతాధికారులను ప్రాధేయపడి నల్లగొండ నుండి బదిలీ చేసుకొని బతుకు జీవుడా అంటూ వెళ్లిపోవాల్సి వచ్చింది.

దీవిస్ కు సహకరించిన పాపానికి సంగీత ఈఈ బదిలీ ప్రమోషన్ కు బ్రేక్ :
కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ జిల్లా పర్యావరణ ఇంజనీర్ సురేష్ బదిలీపై వెళ్లిన తర్వాత వచ్చిన సంగీత ఈఈ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే దివిస్ ల్యాబ్స్ యజమాన్యంతో కుమ్మక్కై దివిస్ పరిశ్రమపై కాలుష్య బాధితులను కనీసం దీవిస్ పరిశ్రమను సందర్శించకుండానే ఏకపక్షంగా దివిస్ కు అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో గత ఐదు సంవత్సరాలుగా దివిస్ ల్యాబ్స్ పరిశ్రమపై జాతీయ హరిత ట్రిబ్యునల్, చెన్నైలో విదారణలో ఉన్న కేసుకు సంబందించి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ దివిస్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడంతో కేసు నెంబర్ 80/2020ని కేసు కొట్టివేసినారు దాంతో సంగీత గారూ అవినీతి అక్రమాలకు పాల్పడినారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో బదిలీ చేశారు అక్రమాలకు అవినీతికి పాల్పడిన సంగీతకు ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు వేసినారని సమాచారం.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS