Monday, August 18, 2025
spot_img

ఎస్సీ ఎస్టీ ల ఉపకులాల వారికి లభించిన ఊరట

Must Read

మన దేశ రాజ్యాంగం రచన నాటికి పూర్వం హిందూమతంలో ఉన్న అదే మతానికి చెందిన అనేక భిన్న వర్గాల జాతుల మధ్య కులాల యొక్క ప్రభావం బలంగా ఉండడం తద్వారా కొన్ని కులాలు అణచివేతకు గురి కావడం, వారికి తగిన అవకాశాలు పొందే వెలులేకపోవడం వలన తరాతరాలు వెనుకబాటుకు గురై సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి నోచుకోకపోవడం, వారు విద్య,ఉద్యోగం,వైద్యం,ఆర్థిక అంశాలతో పాటు ఇంకా అనేక ఇతర అంశాలలో పూర్తిగా నష్టపోవడం జరిగిందని,ఇలా హిందూ సమాజం లో కొన్ని వర్గాల,జాతుల మధ్య అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం వలన ఈ అసమానతలను రూపుమాపి సమాజంలో సమానత్వం తీసుకువచ్చి, భారతీయ సమాజాన్ని అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దాలి అనే ఒక గొప్ప సంకల్పంతో రాజ్యాంగంలో ఆర్టికల్ 15 లో మతం, జాతి, కులం, లింగం, పుట్టుక ఆధారంగా ఎటువంటి వివక్ష చూపరాదు అని తెలియచేస్తూనే ఆర్టికల్ 15(5)లో ఎస్సీ,ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన (ఓబీసీ) వర్గాల ప్రజలకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరియు ప్రెయివేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు గాను వారి కేటగిరి ప్రకారం సీట్స్ ను కేటాయించవచ్చు అని పొందుపరిచారు అంతేకాకుండా ఆర్టికల్ 16 లో అన్ని రకాల ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో అందరికి సమాన అవకాశాలు కల్పించాలి అని తెలియచేస్తూనే ఆర్టికల్ 16(4) లో వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్స్ కల్పించాలి అని ఈ హక్కులను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చిన అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్స్ ద్వారా భారత సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, వారి వెనుకబాటుతనం నిర్ములనకై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చెయ్యాలి అప్పుడే దేశంలో అనేక అసమానతలు తొలగిపోయి సమాజంలో సమానత్వం చేకూరి దేశం అభివృద్ధి వైపు వేగంగా పురోగతి చెందుతుంది అని సూచించారు. ఏ విధంగా అయితే భారతదేశం చరిత్రలో అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఓబీసీ వర్గాల మధ్య సమానత్వం తీసుకురావడం వలన అసమానతలు తొలగించడం కోసం ప్రయత్నం చేసారో అదే తరహాలో ఎస్సీలు 2011 జనాభా లెక్కల ప్రకారం 16.6 శాతం ఉండగా వారికి 15 శాతం రిజర్వేషన్ ఉండడం గమనార్హం ఈ రిజర్వేషన్ అన్ని ఉపకులాల్లో వారి జనాభా నిష్పత్తి ప్రకారం సరైనరీతిలో అమలు కావడం లేదని, ఎస్సీ కులం లో తెలుగు రాష్ట్రాల్లో 59 ఉపకులాలు ఉన్నాయి అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న అనేక ఉపకులల్లో వివిధ జాతుల, వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా ఉండడమే కాకుండా కొన్ని జాతుల వర్గాల ప్రజలు అసలు ఎటువంటి ప్రభుత్వ అవకాశాలను పొందనటువంటి పరిస్థుతులను గమనించిన మంద కృష్ణ మాదిగ గారు ఈ పరిస్థితులను మార్చాలంటే ఖచ్చితంగా ఒక వర్గ పోరాటం తప్పనిసరిగా చెయ్యాల్సిందే అని నిర్ణయించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియెస్) ని 1994 వ సంవత్సరంలో ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఈ వెనుకబడిన ఉపకులాల అభివృద్ధికి, వారి జనాభా నిష్పత్తి ఆధారంగా వారికి అందవలసిన ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రతిఫలాలు వారికి అందించాలనే ఒక గొప్ప ఆశయంతో ఆయన అనేక అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అనే దిశగా ప్రభుత్వాలను డిమాండ్ చేసే అనేక కార్యక్రమాలు జరిపారు. అప్పటికే పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలులో ఉండడం అదే స్పూర్తితో అప్పటి ఈ వర్గీకరణ డిమాండ్ ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు దానితో అప్పుడున్న ప్రభుత్వం వర్గీకరణ అంశం పై జస్టిస్ పి. రామచంద్రరాజు తో ఒక కమీషన్ వేశారు ఈ కమీషన్ తన నివేదికలో మాల, ఆది ఆంధ్రుల కంటే మాదిగ మరియు రెల్లి కులాలు తీవ్ర వెనుకబాటుకు గురైనాయి అని 1997 లో ప్రభుత్వానికి సమర్పించారు దీనితో అప్పటి ప్రభుత్వం రెల్లి, మాల, మాదిగ, ఆది ఆంధ్రులు అనే కులాలతో వర్గీకరణ చేపట్టింది ఇదే అంశాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ సమర్తించి తీర్పును ఇచ్చింది అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ వర్గీకరణ కు వ్యతిరేకంగా ఇ. వి. చిన్నయ్య సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేశారు అయితే సుప్రీం కోర్ట్ 2005 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని ఆర్టికల్ 341 లో ఏ జాతి వారు ఎస్సీ లు, ఏ జాతి వారు ఎస్టీ లు అని నిర్ణయించే అధికారం మాత్రమే పార్లమెంట్ కి ఉంది కానీ ఎస్సీ, ఎస్టీ లను వర్గీకరణ చేయవచ్చు అనే నిబంధన ఎక్కడ లేదు కాబట్టి వర్గీకరణ సాధ్యం కాదని సుప్రీం కోర్ట్ తీర్పును ఇవ్వడం జరిగింది ఈ తీర్పును సవాల్ చేస్తూ మంద కృష్ణ మాదిగ, పంజాబ్ హరియాణా రాష్ట్రాలు మరియు ఇతరులు దాదాపు 22 దావాలు వేశారు ఈ కేసులకి సంబంధించి అన్ని వాదనల తర్వాత ఇటీవల 2024 ఆగస్టు 1న సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 341లో వర్గీకరణ చేయవచ్చు అనే నిబంధన లేదు కానీ వర్గీకరణ చేయకూడదు అన్న నిబంధన కూడా లేదు అని కానీ వర్గీకరణ అవసరమే అన్న తీర్పును సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా జర్నైల్ సింగ్ వెర్సస్ లచ్చిమి నారాయణ గుప్త 2018 కేసు లో పొందుపరిచినట్లుగా ఎస్సీ మరియు ఎస్టీ ల్లో కూడా ఇక క్రీమీ లేయర్ విధానాన్ని అనుసరిచాలి అని సూచించింది. ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు దేశంలో అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ ల మధ్య వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ ని పొందుపరిచి అందరి అభివృద్ధి సమానత్వనికి ప్రాధాన్యత ఇచ్చారో అదే తరహాలో మంద కృష్ణ మాదిగ గారు ఎస్సీ ల్లోని అనేక ఉపకులాల మధ్య జరుగుతున్న అన్యాయాన్ని ఛేదించడానికి వర్గీకరణ అవసరమే అన్న తీర్పును సుప్రీం కోర్ట్ నుండి తీసుకువచ్చారు ఈవిధంగా అన్యాయాన్ని రూపుమాపి వారి వారి జనాభా రీత్యా వారికి న్యాయం జరిగే విధంగా, అనేక ఉపకులాల మధ్య సమానత్వం దిశగా ఎన్ని రాజకీయ సంఘటనలు మరియు ఇతర ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఆయన అలుపెరగని పోరాటం చేసి సాధించి ప్రజలకి అంకితం చేశారు ఇలా ఈ ఆయన పోరాటం ఎస్టీ ల్లో ని ఉపకులాలకి కూడా వర్తించడం వారు కూడా లబ్ది చెందడం జరిగింది ఈవిధంగా ఆయన చేసిన పోరాటం చూసిన ఎస్సీ మరియు ఎస్టీ ల్లోని దేశ వ్యాప్తంగా అనేక ఉపకులాల ప్రజలకు ఆయన ఈ తరం లో మరో అంబేడ్కరుడిగా కనిపించడం గమనార్హం.

గోవింద్ గద్వాల్
అడ్వకేట్

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS