సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో చోరీకి పాల్పడిన నిందితుల దగ్గర వారి వద్ద నుండి రెండు లక్షల 30 వేల రూపాయల బంగారం స్వాధీన పరుచుకొని మఠంపల్లి ఎస్సై బాబు సమక్షంలో రిమాండ్‌కు తరలించారు.