- ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి
- ఆప్ ప్రతిష్టకు సవాల్ కానున్న ఎన్నికలు
- వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌పై కన్ను
- ప్రతిష్టగా తీసుకుని పోరాడుతున్న బిజెపి
దేశరాజధానికి అసెంబ్లీగా ఉన్న ఢిల్లీ ఎన్నికలపై పట్టుకోసం బిజెపి ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆప్ మరోమారు గెలుపు ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా అనేకమంది నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడంతో ఆప్ ప్రతిష్ట కొంత మసకబారింది. మరోవైపు ఆప్‌కు చెందిన పలువురు నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలో ఆప్‌కు గతంలో ఉన్న ఛరిష్మా కనబడడం లేదు. అందువల్ల బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది.. ఎందుకంటే దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో ఏ పార్టీలో అధికారంలోకి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఢిల్లీలో ఎవరు గెలుస్తారో అటుంచితో అసలు బ ఎన్నికలు ఎప్పుడు మొదలయ్యాయి.. మొదటిసారిగా ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాలపై ఒక్కసారి వెనుక్కు వెళదాం.. ఢిల్లీ లెజిస్టేటీవ్ అసెంబ్లీ మొదటిసారిగా మార్చి 7 1952న పార్ట్ సీ కింద ఏర్పాటైంది. దీనిని హోంమంత్రి కట్టూ ప్రారంభించారు. అసెంబ్లీలో అప్పుడు 48 మంది సభ్యులు ఉన్నారు. ఢిల్లీ ప్రధాన కమిషనర్‌కు సలహాదారు పాత్రలో మంత్రుల మండలి ఉంది. అయినప్పటికీ చట్టాలు చేసే అధికారాలు కూడా దీనికి ఉన్నాయి. మొదటి మంత్రి మండలికి చౌదరి బ్రహ్మప్రకాష్ నాయకత్వం వహించారు. ఆయన ఢిల్లీకి మొదటి ముఖ్యమంత్రి కూడా. అయితే 1953 రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా రాజ్యాంగ సవరణకు దారితీసింది. ఇది నవంబర్ 1 1956 నుంచి ఆమలులోకి వచ్చింది. దీని అర్థం ఢిల్లీ ఇకపై పార్ట్ సీ రాష్ట్రం కాకుండా యూనియన్‌గా మార్చబడిరది. భారత రాష్ట్రపతి ప్రత్యక్ష పరిపాలనలో పాలించబడిరది. దీంతో అప్పటి వరకు ఉన్న శాసన సభ, మంత్రి మండలి కూడా ఒక్కసారిగా రద్దయ్యాయి. తదనంతరం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1957 అమల్లోకి వచ్చింది. అలాగే 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ 56 మంది ఎన్నికై, ఐదుగురు నామినేట్ చేయబడిన సభ్యులుతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అధిపతిగా నియమించారు. అయితే కౌన్సిలుకు శాసన అధికారాలు మాత్రం లేకుండాపోయాయి. ఇలా 1990 వరకు కొనసాగుతూ వచ్చింది. మళ్లీ 1993 సంవత్సరంలో ఢిల్లీ 70 శాసన సభా శాసన సభ ఏర్పాటైంది. అయితే 1993 నుంచి 2008 జరిగిన నాలుగుసార్ల ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారు. ఒకసారి బీజేపీకి ఇస్తే, మిగిలిన మూడుసార్లు కాంగ్రెస్సుకు ఇచ్చారు. మొట్టమొదటిసారిగా 2013లో జరిగిన ఎన్నికల్లో హంగు వచ్చింది. ఇందులో బీజేకీ 32 సీట్లు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పటికి పార్టీ స్థాపించి ఒక ఏడాది మాత్రమే అయిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి 28 స్థానాలను కైవశం చేసుకుంది. కేవలం 8 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఆప్ పార్టీకి మద్దతు ఇవ్వటంతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అవినీతి నిరోధక ఎజెండాపై అదికారాన్ని జేజిక్కించుకున్న ఆప్ పార్టీ అవినీతిని దర్యాప్తు చేయటానికి స్వతంత్ర సంస్థను రూపొందించటానికి జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించటానికి ముందుకొచ్చింది. కానీ దాని పదవీకాలం రెండు నెలలలోపే ఉండటంతో ఆప్ జాతీయ కన్వీనర్, మొదటిసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించడంలో విఫలమయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేయడంతో మళ్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. అయితే 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. ఆప్ పార్టీ అఖండ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో సీట్లలో 67 సీట్లు మరియు అత్యదికంగా 54.34 ఓట్ల శాతం సాధించింది.
బీజేపీ మూడు స్థానాలు రాగా కాంగ్రెస్ ఖాతా తెరవకుండాపోయింది. అధికారంలోకి వచ్చిన ఆప్‌పార్టీ మహిళలకు ఉచిత నీరు, విద్యుత్, ప్రజా రవాణా సహా అనేక సంక్షేమ పథకాలు అమలుతో ఆప్ పార్టీ 2020 మరోసారి భారీ మెజార్టీ విజయం సాధించింది. అయితే 2025 కంటే కొంచెం తక్కువగా 62 సీట్లు మాత్రమే వచ్చి 53.57 శాతం ఓట్ల శాతానికి సాధించింది. బీజేపీకి 8 స్థానాలు రాగా ఓట్లు శాతం 38.51 శాతానికి పెంచుకుంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకుండాపోయింది. అయితే 2025 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది వీడని చిక్కుముడిగా మిగిలిపోయింది. ఎందుకుంటే ఇప్పుడు 2024 గత రెండేళ్లుగా ఆప్‌పార్టీకి అవినీతి మరకలు అంటుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు హోమంత్రి కూడా జైలు ఊసలు లెక్కించారు. ఇంకా ఆ కేసుపై విచారణ కూడా నడుస్తునే ఉంది. అందుకే ఈ ఎన్నికలు ఆప్‌పార్టీకి చాలా కీలకంగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీ నుంచి మరింత ఒత్తిడి పెరిగి ఇంకా అనేక కేసులు బనాయించే అవకాశం ఉంది. ఇక బీజేపీకి విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయాల్లో కేవలం ఒకేసారి ఒక్కసారి అధికారంలోకి రావటం, ఢిల్లీ దేశ రాజధాని కావడం దానికి పరువు ప్రతిష్టకు సవాల్‌గా మారింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకున్నా అటు ఆప్ పార్టీని, బీజేపీ ఓట్ల పరంగా ఏ మేరకు దెబ్బతిస్తుందో వేచి చూడాలి. అయితే 2024 జరిగిన లోక్‌సభ ఫలితాలను బట్టి చూస్తే 52 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, 10 స్థానాల్లోనే ఆప్‌పార్టీ ఆధిక్యత కనపిస్తుంది. 8 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్నట్లు ఫలితాలు వచ్చాయి. మరీ వచ్చేనెల 5న జరిగే ఎన్నికల్లో ఢిల్లీ పీఠం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే..?