- ఎండలో పసిగుడ్డుతో నాలుగు గంటలు ఎదురుచూపు
సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల రవళి గత పది రోజుల క్రితం జిల్లా ప్రధాన మాత శిశు ఆసుపత్రిలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. బుధవారం ఆసుపత్రి నుండి డిచార్జ్ అయింది.. ఆ విషయాన్ని సదరు మాతాశిశు శాఖ చిగురుమామిడి వారికి అందించి 102 వాహనంలో తమ గ్రామం అయిన సుందరగిరిలో తమ ఇంటి వద్దకు చేర్చాలని సంబంధిత 102 వాహన సిబ్బందికి సమాచారం అందించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఎండలో పచ్చి బలింతని బిడ్డతో సహా ఆసుపత్రి మెట్ల పైన ఎదురుచూసేలా చేసి.. డబ్బులు ఇస్తేనే ఇంటిదగ్గర దింపుతం అని కర్కశంగా మాట్లాడారని.. బాధితురాలి భర్త సాగర్ ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే వాహనంలో ఎక్కించుకునేదే లేదని ఆసుపత్రికి వచ్చి మరి వాళ్ళు చూస్తుండగానే వాహనాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళినారు. ఇలా వాహన సిబ్బంది వ్యవహరించిన విధానం పైన బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురి అయి దిక్కు లేక ప్రయివేటు ఆటో మాట్లాడుకొని తమ స్వగ్రామం అయిన సుందరగిరికి చేరుకున్నారు. 102 సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మరచి ప్రవర్తించిన విధానం అందరి మనసుని కలిచివేసింది. ఏదేమైనా మండల శిశుశంక్షేమ శాఖ వారు ఇలాంటి పనులు పునరావృత్తం కాకుండా కాకుండా చూడాలని బాధితురాలి భర్త ఆరోపించారు.