Friday, November 22, 2024
spot_img

కారు దిగిన 06 మంది ఎమ్మెల్సీలు

Must Read

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్‌,ఎం.ఎస్‌. ప్రభాకర్‌,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి రాగానే రాత్రికి రాత్రే ఆరు మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి చేరిపోయారు.కొత్తగా 6 మంది ఎమ్మెల్సీల చేరికతో మండలిలో ఆ పార్టీ బలం 12కి చేరింది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ముఖ్యనేతలైన కడియం శ్రీహరి,కేశవ రావు,కడియం కావ్య,బాన్సువాడ ఎమ్మెల్యే,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్,ఎమ్మెల్యే సంజయ్,చేవెళ్ల ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు.తాజాగా మరో ఆరు మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది.రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు ఆ పార్టీను వీడుతారనే వార్తలు కూడా వస్తున్నాయి.మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ చేరుతారని తెలుస్తుంది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS