కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం రేపింది.14 ఏళ్ల బాలుడిని ఈ వైరస్ బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్తే,మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఇటీవల నిపా వైరస్ సోకింది.దీంతో ఓ ఆసుపత్రిలో వెంటీలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఆ బాలుడు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణ జర్క్ తెలిపారు.వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే బాలుడు మరణించడం,రాష్ట్రంలో క్రమక్రమంగా నిపా వైరస్ కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.వైద్యులకు కీలక సూచనలు చేసింది.