న్యాయం కోసం పోరాడే యువ న్యాయవాదుల సందడితో “అనంత న్యాయ కళాశాల” మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ మారుమ్రోగింది.కోవిడ్ టీకాకు సంబంధించిన అప్పీల్ కేసు అంశం పై జరిగిన పోటీలో 24 బృందాలుగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ జిబి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం న్యాయ విద్యార్థులకు మంచి అవకాశం అని అన్నారు.నూతన చట్టాలపై ప్రజలలో అవగాహన పెంచడం ఎంతో అవసరమని అన్నారు.అనంతరం పోటీలో గెలిచిన వారికీ ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమతి మాట్లాడుతూ పోటీ న్యాయ విద్యార్థులలో న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచడమే కాకుండా,వారిలో మౌఖిక నైపుణ్యాలు,విశ్లేషణాత్మక సామర్థ్యాలను,మనోధైర్యంను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని తెలిపారు.ఈ పోటీల్లో అశోక్ రెడ్డి బృందం అత్యుత్తమ ప్రతిభను చాటి, ప్రథమ విజేతగా నిలిచింది.న్యాయ చట్టాలపై అవగాహన,వాద-ప్రతివాదలతో వారు కనబరచిన మెలకువలతీరు,న్యాయ పరమైన చిక్కులను చేదించే విధానం, న్యాయమూర్తులను ఒప్పించిన విధానం,క్రమశిక్షణగా ప్రతివాదులను వాదనలతో ఇరుకున పెట్టే తదితర అంశాలపై అత్యుత్తమ ప్రతిభను చాటి ప్రధమ విజేతలుగా నిలిచినా అశోక్ రెడ్డి బృందం పై కళాశాల అధ్యాపక బృందం మరియు కళాశాల విద్యార్థులు ప్రశంసల వర్షం కురిపించారు.