ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..
కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..
కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..
భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టి
ముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..
కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసం
పాటుపడ్డారు..ఇప్పుడు ఆ కార్యకర్త బరువయ్యాడు..భుజాలపై మోసి చట్టసభలకు
పంపితే ఓ కులి అయ్యాడు..అధికారం వచ్చాక కార్యకర్త కంటికి కనబడకుండా పోయాడు..రాజకీయం మారిపోతుంది కార్యకర్త కష్టం కరిగిపోతుంది..
- రమేష్ గాండ్ల