పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆదానీ అంశంపై చర్చించాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి.
దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.
ఆదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగుర్ గౌతం ఆదానీపై చర్చకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చించడానికి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. తీర్మాణాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు.