- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దు..త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..మళ్లీ కెసిఆర్ సీఎం కాబోతున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీక్షాదివస్ సందర్భంగా వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు..సోనియాగాంధీని బలిదేవత అని ఇప్పుడు దేవత అంటున్నాడు..వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న దేవత సోనియా గాంధీ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.