- ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది
- 12 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు
- 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
- కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
- 50 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాము
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జూన్ 04న జరగబోయే కౌంటింగ్ కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్బంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ , ఏర్పాట్ల తదితర అంశాల పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా , ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేలా మూడంచెల భద్రతాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.లోక్ సభ ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.ఎలాంటి అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించొద్దు అని అధికారులకు కోరారు.కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని పేర్కొన్నారు.17 నియోజకవర్గాల్లో ఒక్క పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక హాల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది సిబ్బంది అవసరం ఉంటే ఇంకో 50 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు.ప్రతి కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని అన్నారు.2 లక్షల 80 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని , 276 టేబుళ్లను పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్బంగా తెలిపారు.ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని అన్నారు. ప్రతీ రౌండ్ లో సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎంలను కౌంట్ చేస్తారని వెల్లడించారు.