- సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్దికి నిధులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ నగర అభివృద్దికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదని, మాజీ సీఎం కెసిఆర్ ఆబద్దాలతో గడిపేశారని విమర్శించారు. గుజరాత్ రాష్ట్రానికి మోడీ నిధులు తీసుకెళ్తుంటే కిషన్ ఏం చేయడం లేదని అన్నారు. మూసీ పునరుజ్జీవానికి భారాస,బిజెపి ఎందుకు అడ్డువస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తెస్తారో..గుజరాత్ కు వెళ్తారో చెప్పాలని అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఎస్టీపిలు, ఫ్లైఓవర్ల అభివృద్దికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.