Wednesday, January 22, 2025
spot_img

విదేశాల్లో తెలంగాణ ఇజ్జత్ తీయ్యోద్దు..

Must Read
  • ఎవరి పని వారే చేయాలి అన్న కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు
  • కేసులు కక్ష సాధింపు చర్యలేనా అభివృద్ధి అంటే
  • ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలేవి
  • ప్రభుత్వాలు మారిన ఒప్పందాలు మారవన్న ఇంగితం లేదా
  • కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుంది రేవంత్ పరిపాలన
  • రేవంత్ ప్రభుత్వం పై దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్

రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టాయని రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవడం, ఈ కార్ రేస్ కేసుల వలన విదేశీ కంపెనీలు కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏసీబీ ముసుగులో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు, ఈడీ ముసుగులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుమ్మక్కై నిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ను అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌(BRS) నేత దాసోజు శ్రవణ్‌(Dasoju Sravan Kumar) ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలకు చేసిన కేటీఆర్‌ మొన్న ఏసీబీ, ఈడీ విచారణకు హాజరయ్యారు. దర్యాపు సంస్థల విచారణ తీరు చూస్తుంటే ఇది ముమ్మాటికీ తప్పుడు కేసు అనేదిఅర్థమవుతుంది. అభివృద్ధి అంటే కేసులు కక్షసాదింపు చర్యలేనా. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ప్రజల హక్కులను ప్రశ్నించే వారిపై దౌర్జన్యానికి దిగడం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. హోం శాఖ తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి.. ప్రతి సందర్భంలోనూ హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడటం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విధ్వంసక చర్యలకు తెలంగాణలో ఎక్కడ స్థానం ఉండకూడదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక చర్యలు సహించలేము. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, తప్పు చేసిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కానీరెవంతరెడ్డి పైనతనపై కేసులు ఉన్నాయని ఇతరులపై కూడా కేసులు మోపాలనే ఉద్దేశం మంచిది కాదు. రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు విధ్వంసక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది .

దేశ రాజధాని ఢిల్లీలో అటు దావూస్ సింగపూర్ పర్యటనలో తెలంగాణ ఇజ్జత్ తీసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy). కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ తమ దగ్గర ఉండాలని చదువుతోపాటు మేధస్సు కూడా పనిచేయాలని. విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే విధానం ఇది కాదని తనకు అంతా తెలుసనే మూర్ఖత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజల గౌరవ మర్యాదలను విదేశీ గడ్డపైన ఇజ్జత్ తీసినంత పని చేశారు. పక్కన ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నప్పటికిని అన్ని తానే మాట్లాడడం చూస్తుంటే విడ్డూరం కలుగుతుంది. ఈయన మాట్లాడే మాటలు అక్కడివారికి అర్థం కాక పెట్టుబడులు ఉపసంహరించుకునే పరిస్థితులు కూడా నెలకొంటాయని అందుకే చదువు మేధస్సు ఉన్నవారే మాట్లాడి విదేశీ కంపెనీలను తీసుకురావాలి. ఎవరి పని వారే చేయాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించాలనే ఉద్దేశం నాది కాదని కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విధానం సరైంది కాదని చెప్పుకొచ్చారు.

గతంలో ప్రభుత్వంలో విదేశీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు తప్పుడు ఒప్పందాలంటూ వాటిని రద్దు చేయాలని గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా పూర్తి నేపాన్ని కెసిఆర్ ప్రభుత్వం మీద నెట్టడం ఒక కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి చేసే పని కాదు. కేటీఆర్ పై ఉన్న అక్కస్సుతో ఆయన తీసుకువచ్చిన విదేశీ కంపెనీలు అన్నీ బోగస్ లు అంటూ వాటి అగ్రిమెంట్లు రద్దు చేయాలంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటు. ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ప్రభుత్వం మారినప్పుడల్లా సంస్కరణలు మార్చుకుంటే ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది పెట్టుబడులు ఎలా తేగలుగుతారు అన్న సోయి కూడా ఆయనకు లేకపోవడం ఎంతో బాధాకరం. ఆరుగ్యారంటీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 6 గ్యారంటీలకు సంబంధించిన ఎన్నో పథకాలు ముడిపడి ఉన్నాయని ఎక్కడ కూడా వాటిపై మాట్లాడకుండా దాడి చేయడం చేస్తున్నారు. కూట్లే రాయి తీయలేనోడు ఏట్లో రాయితీసినట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలకే దిక్కులేదుఢిల్లీలో కూడా తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ పోజులు కొట్టడం ఏంటో అర్థం కాలేదు. పూర్తిస్థాయిలో రైతు భరోసాను అమలు చేయలేక రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు చెప్పిన పథకాలు పూర్తిస్థాయిలో ఎక్కడ అమలు కాలేదని తెలంగాణ ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్న అవేవీ వీళ్లకు పట్టవని వారి ఆలోచన మొత్తం సంపాదనే దేయంగా ఉందని ప్రజలు ఎలా పోతే మాకేంటన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS