తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కినట్టు తెలుస్తుంది.తెలంగాణలో బిజెపి నుండి గెలిచినా 8 మంది ఎంపీల్లో బండి సంజయ్ కూడా ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి టీ – బీజేపీలో జోష్ పెంచారు.గత ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి బిజెపి పార్టీని ముందుకు తీసుకొనివెళ్ళడంలో అయిన సక్సెస్ అయ్యారు.గతంలోనే బండిసంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తర్వాత కేంద్ర మంత్రి కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిను కట్టబెట్టారు.
దేశ ప్రధానిగా ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు.మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారిలో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి , బండి సంజయ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే బండిసంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్టు ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది.అయితే ఎ మంత్రి పదవి ఇస్తారనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు