Friday, November 22, 2024
spot_img

ప్రతి తాండకు విద్యను అందించడమే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Must Read
  • ప్రతి తాండకు,ప్రతి గ్రామానికి విద్యను అందిస్తాం
  • సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయము
  • శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను రూ 2 వేల కోట్లతో పనులు మొదలు పెట్టం
  • ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ప్రభుత్వానికి గర్వకారణం
  • 90 శాతం మంది ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్ లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు
  • నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా

ప్రతి గ్రామంకు,ప్రతి తాండకు విద్య అందించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సోమవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.గతంలో విద్యార్థులు రాకపోవడం వల్ల సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేశారని కానీ ఇప్పటి నుండి అలాంటి పరిస్థితి ఉండబోదని అన్నారు.మౌలిక వసతుల పై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి అభివృద్ది చేయడం కోసం రూ 2వేల కోట్లతో పనులు మొదలుపెట్టమని వెల్లడించారు.ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని,ఎవరైనా సరే సూచనలు,సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని తీసుకుంటామని స్పస్టం చేశారు.విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోకి చేర్పించేందుకు ప్రభుత్వం “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గుర్తుచేశారు.ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాద్యత మహిళాల సంఘాలకి అప్పగించమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ప్రభుత్వానికి గర్వకరణమని అన్నారు.90 శాతం మంది ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్ అధికారులు,రాజకీయ నేతలైన నరేంద్ర మోడి ,చంద్రబాబు ఆఖరికి తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివమనీ అన్నారు.గ్రామాల్లో ఉండే పాఠశాల పై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు హెచ్చరించారు.తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా పనిచేస్తామని అన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS