Saturday, July 26, 2025
spot_img

అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే

Must Read

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు కవిత ట్వీట్

తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చకు దారి తీసిన పరిణామం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!!” అంటూ సింపుల్ కానీ సిగ్నిఫికెంట్‌గా ట్వీట్ చేసి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. కవిత చేసిన ఈ ట్వీట్‌తో కుటుంబ సంబంధాలను ప్రదర్శించడమే కాకుండా, ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల మధ్య సానుకూల సంకేతం ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ, బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలపై వర్గాలలో చర్చలకు కారణమయ్యింది. ఆ లేఖ నేపథ్యంలో కవిత, కేటీఆర్ మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని, వారి మధ్య చర్చలు తగ్గాయని వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ పుట్టినరోజు ట్వీట్ ద్వారా కవిత వ్యక్తిగత సంబంధాలు వేరని, కుటుంబ బంధం అనేది రాజకీయ సమీకరణాలకు అతీతమని సంకేతమిచ్చినట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఇటీవల పార్టీ వ్యూహాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కవిత ట్వీట్ చేయడం పార్టీ కార్యకర్తల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ కూడా కవితకు ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని రోజులుగా పార్టీ అధికారాన్ని తిరిగి సాధించేందుకు జరుగుతున్న చర్చల నడుమ, ఈ ట్వీట్ “కుటుంబ ఐక్యత”కు ప్రతీకగా కూడా నిలుస్తోంది.

Latest News

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల మృతి కారు అదుపు తప్పి డివైడర్ తాకి మ‌ర‌ణం నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలో శ‌నివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS