Friday, November 22, 2024
spot_img

కరీంనగర్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా:బండిసంజయ్

Must Read
  • కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది
  • ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా
  • కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా
  • ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం
  • కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్

కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ బండిసంజయ్.ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో దేశప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.మోడీతో పాటు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.ప్రమాణస్వీకారం చేసిన వారిలో కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ కూడా ఉన్నారు.తనకు కేంద్రమంత్రి పదవి దక్కడం పై అయిన స్పందించారు.ఈ సందర్బంగా బండిసంజయ్ మాట్లాడుతూ కేంద్రమంత్రి పదవి దక్కడం పై హర్షం వ్యక్తం చేశారు.తన పైన నమ్మకంతో కేంద్రమంత్రి పదవిను అప్పగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.కరీంనగర్ ప్రజల వల్లే తనకు ఈ అవకాశం లభించిందని,జిల్లా ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్బంగా బండిసంజయ్ పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం,కరీంనగర్ జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానని తెలిపారు.ఎన్నికలప్పుడే రాజకీయాలని విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు పేర్కొన్నారు.కేంద్రమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని సహాయసహకారాలు అందిస్తానని వెల్లడించారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS