ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉండడంతో కవితను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ల కింద ఈడీ అరెస్ట్ చేసింది.అప్పటి నుంచి కవిత అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన ఆమెకు బెయిల్ దక్కలేదు.కవితను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టు జుడీష్యల్ రిమాండ్ మరో రెండు రోజుల పాటు పొడిగించింది.