ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఇంగ్లీష్ విద్యా చాలా అవసరమని పోటీ ప్రపంచంలో నిలదొక్కు కోవాలంటే ఇంగ్లీష్ విద్యా అవసరమని అన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్ విద్యాను సిఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో బలోపేతం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ స్కూల్ లో చదువుకొని విదేశాలలో స్థిరపడిన ఎన్.ఆర్.ఐ.లు ప్రభుత్వా స్కూల్ లను దత్తత తీసుకోవాలని కోరారు.ప్రపంచ బౌద్ధ క్షేత్రం ఫనిగిరి లో ఉన్నందున రాబోయే రోజులలో ఫణిగిరి ప్రభుత్వా స్కూలు అభివృధ్ధి చేయబడుతోందనీ అన్నారు.ఫానిగిరి లో హై క్వైలీఫై టీచర్ లు ఉన్నారని డి.ఈ.ఓ మరియు ఎం.ఈ.ఓ బడిబాట విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో నాగారం ఎం.ఈ.ఓ బాలు నాయక్, ప్రధన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి ,ఉపాద్యాయులు పాల్గొన్నారు