జూన్ 18 న జరగబోయే యుజీసి నెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎస్టీఏ విడుదల చేసింది.జూనియర్ రిసెర్చి ఫెలోషిప్,యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు,రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తునట్టు తెలిపింది.అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన,ఇలా మొత్తం 83 సబ్జెక్ట్స్ లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.తెలంగాణలోని 15 కేంద్రాల్లో, ఏపీలో 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.