Sunday, November 24, 2024
spot_img

ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది

Must Read
  • ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్
  • ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్
  • ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు
  • వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది
    -ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం
  • ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
  • ఈవీఎం హ్యాకింగ్ భారత్ లో సాధ్యం కాదు
  • భారత్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశాం

టెస్లా,స్పేస్‌ఎక్స్‌,సోషల్‌ మీడియా ప్లాట్‌ఫా ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఎలాన్ మాస్క్ ఏం మాట్లాడిన,ఏం చేసిన ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతారు.తాజాగా ఈవీఎం లు హ్యాకింగ్ గురవ్వడం పై ఎలాన్ మాస్క్ ఆందోళన వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల పై సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ఎలాన్ మాస్క్ స్పందించారు.ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించవచ్చని తెలిపారు.ఈవీఎంలను వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని,ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు.ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయి అని ఖూ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ జూనియర్‌ ఎక్స్ లో పోస్ట్ చేశారు.పేపర్‌ ట్రయిల్‌ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని,లేదంటే ఏం జరిగేదో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను నివారించడానికి పేపర్‌ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు.రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ జూనియర్‌ చేసిన ఈ వ్యాఖ్యల పై ఎలాన్ మాస్క్ స్పందిస్తూ
ఎన్నికల్లో ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎలాన్ మాస్క్ చేసిన ఈ వ్యాఖ్యల పై ప్రపంచ దేశల నుండి భిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎలాన్ మాస్క్ చేసిన ఈ వ్యాఖ్యల పై కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.ఈవీఎం హ్యాకింగ్ భారతదేశంలో సాధ్యం కాదని తెలిపారు.భారత్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ గాని,వైఫై,బ్లూటూత్ కనెక్షన్ లేదని గుర్తుచేశారు.అప్పుడు హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఎలా ఉంటుందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రశ్నించారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS