Friday, September 20, 2024
spot_img

అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకొనే

Must Read

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. కల్కి 2898 ఏడీ స్టార్‌ గా దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. 2024 మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ నటిగా మరోసారి తన పేరు రికార్డుల్లో నిలవనుంది. ఈ బ్యూటీ ఆలియా భట్‌, కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌లను అధిగమించి పారితోషికం జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరం గా, ఈ జాబితాలో దక్షిణ భారత కథానా యికల పేర్లు కనిపించ లేదు.Iవీణప సహాయంతో ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో దీపికా పదుకొణె 2024లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా ఆవిర్భవించింది. ప్రతి సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు పారితోషికం దీపిక వసూలు చేసింది. ఆమె తర్వాత నటి కం రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు క్వీన్‌ రూ.15 కోట్ల నుంచి రూ.27 కోట్లు తీసుకుంటుంది. ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల పారితోషికంతో ప్రియాంక చోప్రా జోనాస్‌ మూడో స్థానంలో ఉంది. కత్రినా కైఫ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కత్రిన ఒక్కో సినిమాకి 15 కోట్ల నుండి 25 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఒక సినిమాకు 10 నుంచి 20 కోట్లు డిమాండ్‌ చేస్తున్న నటిగా అలియా భట్‌ ఐదో స్థానంలో ఉంది. జాబితాలో కరీనా కపూర్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌, విద్యాబాలన్‌ పేర్లు ఉన్నాయి. కరీనా ఒక సినిమాకి రూ. 8 కోట్ల నుండి రూ. 18 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు వసూలు చేస్తున్న నవతరం నాయికగా శ్రద్ధా కపూర్‌ పేరు రికార్డుల్లో ఉంది. విద్యాబాలన్‌ ఒక్కో సినిమాకు 8 కోట్ల నుండి 14 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్‌ 10 నటీమణుల జాబితా అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ రికార్డుల్లో ఉన్నారు. అనుష్క శర్మ ఒక సినిమాకి రూ. 8 కోట్ల నుండి రూ. 12 కోట్లు వసూలు చేస్తుందని, పొన్నియన్‌ సెల్వన్‌ స్టార్‌ ఐశ్వర్యారాయ్‌ ప్రతి చిత్రానికి రూ. 10 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని ఐఎండిబి-ఫోర్బ్స్‌ సర్వే పేర్కొంది. దీపికా, అలియా ప్రధాన పాత్రల్లో ప్రస్తుతం కొన్ని భారీ బడ్జెట్‌ చిత్రాలు రూపొందుతున్నాయి. దీపిక ఈ నెలాఖరులో ప్రభాస్‌-అమితాబ్‌ బచ్చన్‌ లాంటి టాప్‌ స్టార్లతో కలిసి కల్కి 2898ఏడీలో కనిపించనుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This