Friday, September 20, 2024
spot_img

ఘనంగా”జాతీయ నులిపురుగుల నివారణ”దినోత్స కార్యక్రమం

Must Read

(ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రావు,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్)

  • విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు వేసిన మంత్రులు
  • పిల్లల శారీరక ఎదుగుదలకు “డివార్మింగ్” మాత్రలు ఎంతగానో
    ఉపయోగపడుతాయి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం

హైదరాబాద్ లోని రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రావు,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.అనంతరం విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు వేశారు.ఈ సంధర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీ వార్మింగ్ డే జరుపుకుంటున్నామని తెలిపారు.పిల్లల శారీరక ఎదుగుదలకు “డీ వార్మింగ్” మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని
అన్నారు.ఈ నెల 20 నుండి 27 వరకు హైదరాబాద్ లో ఉన్న 11 లక్షల 77 వేల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా మాత్రలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఈ మందులు వేయవచ్చు అని తెలిపారు.శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ మాత్రాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో ఆరోగ్య శాఖ నీ మరింత ముందుకు తీసుకొని వెళ్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బర్రా వెంకటేశం ,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా ,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This