- అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 164 మంది పోలీసు అధికారులు
- ఉత్తీర్ణులైన 164 మందిలో 19 మంది తెలంగాణకి చెందిన అధికారులే
- తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు
- అభినందనలు తెలిపిన ఉన్నతాధికారులు
జూన్ 06న తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్ లో 164 మంది పోలీసు అధికారులు సంపూర్ణంగా ఉత్తిర్ణులయ్యారు.దేశవ్యాప్తంగా 225 మంది పోలీసు అధికారులు ఢిల్లీలోని 22వ బెటాలియన్ , ఐటీబీపి లో నిర్వహించిన పరీక్షలకు అటండ్ అయ్యారు.న్యూయార్క్ నుండి వచ్చిన ఇద్దరు ఆఫీసర్స్ పోలీసు అధికారులకు ఇంగ్లీష్ పరీక్షలు,డ్రైవింగ్ టెస్ట్,ఫైరింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షకి మొత్తం 225 మంది హాజరు అవ్వగా 164 మంది అధికారులు ఉత్తీర్ణులయ్యారు.164 మంది అధికారుల్లో 19 మంది పోలీసు అధికారులు తెలంగాణకి చెందిన వారు ఉన్నారు.ఉత్తీర్ణులైన వీరు తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు.తెలంగాణ నుండి ఉత్తీర్ణులైన 19 మంది అధికారులకు ప్రభుత్వం,ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.ఉత్తీర్ణులైన వారిలో కెఎం కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్ హైదరాబాద్, నర్సింగరావు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఏసీపీ, అలెక్స్ కమాండెంట్, దేవేందర్ సింగ్ ఎస్పీ,చల్లా శ్రీధర్ నార్కోటెక్ బ్యూరో, ప్రతాప్ డిఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జూపల్లి రమేష్ ఏసిపి, గారు మాజీధాలీ ఖాన్ ఏసీపీ, శ్రీధర్ రెడ్డి కోదాడ డిఎస్పీ, సురేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విజయకుమార్ సిఐడి, శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్, ఇతర అధికారులు ఉత్తీర్ణులయ్యారు.