ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా 10లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని,ఈజిప్టు దేశం నుండి మరో పది లక్షల పైగా భక్తులు హజ్ యాత్రలో పాల్గొన్నట్టు తెలిపింది.అధిక ఉష్ణోగ్రతలు,వేడిగాలుల వల్ల అధిక మంది భక్తులు ఇబ్బంది పడ్డారని,మరణాలు సంభవించిన రోజున ఏకంగా 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉంటే హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.1,75,000 మంది భారతీయులు ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి వెళ్ళినట్లు తెలిపింది.