నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఆర్.ఆర్.బీ భోపాల్.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్.ఆర్.బీ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5,696 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.ప్రకటించిన పోస్టులను పెంచాలని మరో ప్రకటన విడుదల చేసింది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని,ఏమైనా సందేహాలు ఉంటే అధికార వెబ్ సైట్ https://indianrailways.gov.in/ లో చెక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలని తెలిపింది.రాత పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్,కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.