Friday, September 20, 2024
spot_img

హస్తినలోనే సీఎం రేవంత్, వాయిదా పడిన వరంగల్ పర్యటన

Must Read
  • నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా
  • వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం
  • పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ
  • నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్

శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై అధిష్టానంతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు.రాష్ట్ర ప్రయోజనాలతో పాటు తెలంగాణకి రావాల్సిన నిధులు,పెండింగ్ లో ఉన్న అంశాల పై కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశం అయ్యారు.మరో వైపు పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక,మంత్రివర్గ విస్తరణ,తదితర అంశాల పై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.పీసీసీ అధ్యక్షుడిగా విజయాలు సాధించానని అన్నారు.పీసీసీ అధ్యక్షుడిగా అర్హత ఉన్న నాయకులకు పదవి ఇవ్వాలని అధిష్ఠానం దృష్టికి తీసుకోని వెళ్లినట్టు తెలిపారు.మరోవైపు శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది.వరుస సమావేశాలు ఉన్న కారణంగా శుక్రవారం ( నేడు ) వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన వాయిదా పడింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This