( బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ )
ఎన్నికల ప్రచారంలో భాగంగా అశోక్ నగర్ గ్రంథాలయం వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మా ప్రభుత్వానికి గెలిపించండి అంటూ నమ్మబలికి,అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.అధికారంలోకి వచ్చిన 100 రోజులలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.మార్పు కావాలని,తెలంగాణ భవిత మారాలని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.టీచర్ పోస్టుల పరీక్షలు వాయిదా వేసి,మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒక పరీక్షకు మరియు మరో పరీక్షకు మధ్యన సరిపోయే సమయం ఉండే విధంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల పవన్,రాష్ట్ర ఉప అధ్యక్షులు నమని మహేష్,తరుణ్ రెడ్డి,చితరంజాన్ రెడ్డి,అశోక్ ప్యాట,శివాజీ, శివ,వినీత్, అరవింద్, నితిన్,సుధీంద్ర శర్మ,ఆయుష్ రాజ్,గోవర్ధన్ రెడ్డి,వినేయకుమార్,విక్రమ్, శ్రీకాంత్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.