రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారని,మరొకరికి కంపెనీని తక్కువ ధరకి అమ్మేల ఒత్తిడి చేశారంటూ ఓ వ్యాపారవేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.